తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం జనవరి 5 తెలుగు వెలుగు) : కొత్తగూడెం నుంచి జూలూరుపాడు పరిసర ప్రాంత పిల్లలను పాఠశాలలకు తీసుకువెళ్లే బస్సులను జూలూరుపాడు మండల కేంద్రంలో సీఐ శ్రీలక్ష్మి, ఎస్సై రవిలు తనిఖీ చేశారు. బస్సులు అన్ని రకాల అనుమతులు ఉన్నాయా లేదా అని వాటి పత్రాలను పరిశీలించారు అలానే పాఠశాలలకు విద్యార్థులను తరలించే క్రమంలో నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తలు పాటించాలని సిఐ శ్రీలక్ష్మి బస్సుల డ్రైవర్లకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. సీఐ శ్రీలక్ష్మి,ఎస్సై రవి లు మాట్లాడుతూ బస్సులకు ఎమర్జెన్సీ ఎగ్జిట్, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలనీ డ్రైవర్ క్లీనర్ ఎట్టి పరిస్థితిలో మద్యం తాగి డ్రైవింగ్ చేయొద్దని స్కూల్ బస్సులకు సంబంధించిన ఫిట్నెస్ సర్టిఫికెట్, ఆర్ సి, ఇన్సూరెన్స్ అన్ని సర్టిఫికెట్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ప్రైవేట్ స్కూల్స్ బస్సుల డ్రైవర్లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ