తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : శ్రీరామనవమి సందర్భంగా కొత్తగూడెం పట్టణంలోని డాక్టర్ బిందుపల్లవి హాస్పిటల్ వద్ద బిజెపి రాష్ట్ర మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు బానోతు విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఎంజీ రోడ్డుపై. భద్రాచలం రాముల వారి కళ్యాణనికి విచ్చేసిన భక్తులకు పానకం, మజ్జిగ, అల్పాహారాన్ని పంపిణీ చేయడం జరిగింది. జైశ్రీరామ్ జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కోనేరు సత్యనారాయణ (చిన్ని), బానోతు విజయలక్ష్మి, లయన్ కొత్తగూడెం క్లబ్ అధ్యక్షులు కోనేరు పూర్ణచందర్ రావు, డాక్టర్ బిందు పల్లవి తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ