తెలుగు వెలుగు టీవీ - వార్తలు / భద్రాచలం : 2026-28 విద్యా సంవత్సరమునకు గాను రాష్ట్రంలోని ఏజెన్సీ షెడ్యూల్ ప్రాంత గిరిజన అభ్యర్థుల సంక్షేమార్థం భద్రాచలం ఐటిడిఏ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ప్రత్యేక గిరిజన డి. ఎల్. ఈ డి కళాశాలలో తెలుగు మీడియం (12 బ్యాచ్) రెగ్యులర్ డి. ఎల్. ఇ డి కోర్సులో ప్రవేశం నిమిత్తం ఏజెన్సీ షెడ్యూల్డ్ ప్రాంత గిరిజన అభ్యర్థుల నుండి నేరుగా దరఖాస్తులను కోరుతున్నట్లు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ బుధవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఉపాధ్యాయ విద్యా కళాశాలలో మొత్తం 50 సీట్లు కలవని, కళాశాలలో ప్రవేశానికి అర్హతలు తెలంగాణకు చెందిన అభ్యర్థులు ఏజెన్సీ షెడ్యూల్ ప్రాంతములకు చెందిన గిరిజన అభ్యర్థులై ఉండవలెనని, మే/జూన్ 2026 కానీ అంతకు ముందు కానీ ఇంటర్మీడియట్ పాసై కనీసం 45 శాతం మార్కులు సాధించి ఉండాలని, సంబంధిత ఇంటర్మీడియట్ పరీక్షలో సాధించిన మెరిట్ ని బట్టి ఎంపిక జరుగుతుందని, ప్రభుత్వ నియమ నిబంధన ప్రకారము మహిళలకు ప్రత్యేక కేటగిరి వారికే సీట్లు రిజర్వు చేయబడ్డాయని, ప్రభుత్వ ఉత్తర్వులు నెంబర్ 01. తేదీ 04-08-2014, నెంబర్ 63. తేదీ 28-10-2013, నెంబర్ 22. తేదీ 29-05-2014 మరియు నెంబర్ 10. తేదీ 12-04-2017 ప్రకారం పూర్తి మెరిట్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కళాశాలలో ప్రవేశానికి ప్రాస్పెక్టస్ మరియు దరఖాస్తులు ఉచితంగా లభిస్తాయని, ఏటూరు నాగారం, ఉట్నూర్, మన్ననూరు ఐటిడిఏ కార్యాలయంలలోను మరియు గిరిజన డి ఎల్ ఈ డి కళాశాల భద్రాచలం నందు ప్రోస్పెక్టరేస్ మరియు దరఖాస్తులు ఉచితంగా పొందవచ్చునని ఆయన అన్నారు. దరఖాస్తు పోస్టు ద్వారా పొందగోరు అభ్యర్థులు తమ సొంత అడ్రస్ గల కవర్ (రు.10/-స్టాంపుతో)ను ప్రిన్సిపాల్, గిరిజన విద్యా కళాశాల, భద్రాచలంకు పంపి పొందవచ్చునని, దరఖాస్తు మరియు ప్రాస్పెక్టస్ క్షుణ్ణంగా చదివి దరఖాస్తుని సక్రమంగా పూర్తి చేసి వచ్చేనెల 11 వ తారీకు వరకు సమర్పించాలని ఆయన కోరుతూ అసంపూర్తి దరఖాస్తులు తిరస్కరించబడునని అన్నారు. మరిన్ని వివరాలకు 9959575539, 8639084543, 8309972776 ఫోన్ నెంబర్లను సంప్రదించి వివరాలు తెలుసుకోవాలని ఆయన కోరారు. అదనపు పౌర సంబంధాల అధికారి కార్యాలయము భద్రాచలం నుండి జారీ చేయడమైనది
Admin
తెలుగు వెలుగు టీవీ