తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూనియర్ ఇంటర్ 2026 ఫలితాలలో 470 మార్కులకు గాను 469 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయి లో ప్రధమ మార్కు సాధించిన శ్రీ నలంద జూనియర్ కళాశాల విద్యార్ధి పరిమి చరణ్ ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్.పి శ్రీ రోహిత్ రాజ్ అభినందించారు. ఈ సందర్భంగా ఎస్.పి మాట్లాడుతూ ఈ విజయ స్ఫూర్తితో బాగా కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థికి సూచించారు. రాష్ట్ర స్థాయి మార్కు సాధించటం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకే గర్వకారణమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థి తల్లిదండ్రులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో శ్రీ నలంద జూనియర్ కళాశాల సి.ఇ.ఒ చైతన్య కృష్ణ మరియు విద్యార్ధి తల్లిదండ్రులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ