తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తెలంగాణ రాష్ట్ర బందు పిలుపులో భాగంగా సిపిఐ అనుబంధ సంఘం ఏఐవైఎఫ్ రాష్ట్ర నాయకత్వం పిలుపులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం రామవరం పట్టణంలో ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎస్కె ఫయుమ్ దాదా ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి అనంతరం ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఫయూమ్ మాట్లాడుతూ బీసీ బిల్లు 42 శాతం అమలుపరచకుండా హైకోర్టులో రీట్ పిటిషన్ దాగాలు చేసిన బి.మాధవరెడ్డి బీసీలపై చూపిన పాశవిక చర్యను ఖండిస్తున్నామని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు పరచాలని తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు, సుప్రీంకోర్టులు నిరాకరించడం బాధాకరమని, బీసీ 42 శాతం బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని, బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అసెంబ్లీ ,పార్లమెంటులో అవకాశం కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 56% గా ఉన్న బీసీలను 42 శాతం రిజర్వేషన్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించడంతో అగ్రవర్ణాలు ఎందుకు అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలోఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్కె ఖయ్యూం, జిల్లా ఉపాధ్యక్షుడు బరిగెల భూపేష్, రామవరం సిపిఐ బ్రాంచ్ కార్యదర్శి మర్రి గోపికృష్ణ, సిపిఐ , ఏఐవైఎఫ్ నాయకులు జావిద్, రణధీర్, అల్ల కొండ గోపి, జంజర్ల కృష్ణ, కొయ్యడ రవి,శివ, రౌతు సురేష్, విజయ్ కాంత్, వెంకట్ ,చంటి తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ