Saturday, 18 April 2026 02:47:45 AM
# ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్. # ఐదు గ్రామపంచాయతీల కోసం సమరభేరి - సోమవారం భద్రాచలంలో భారీ సభ - హాజరుకానున్న రేణుకా చౌదరి. # అంగన్వాడి కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. # 'ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా జిల్లా డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో అలవాటుగా మారే మందుల దుర్వినియోగంపై సమగ్ర అవగాహన సదస్సు . # అణగారిన వర్గాలకు అక్షరజ్యోతి ఫూలే. జ్యోతిరావు ఫూలే జీవితం ఎందరికో ఆదర్శం. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి : జిల్లా వైద్యశాఖ అధికారి డా. తుకారాం రాథోడ్. # సాదా బైనమా దరఖాస్తుల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ .

మెరుగైన నైపుణ్యాలతోనే యువతకు అవకాశాలు. జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 10 January 2026 07:00 PM Views : 140

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం: వృత్తి నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ పోతేనే యువత తమ భవిష్యత్తును అభివృద్ధి పథంలోకి తీసుకురాగలరని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు.శనివారం ఐడీఓసీ (IDOC) కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో లెర్నెన్ ప్రైవేట్ లిమిటెడ్ వారిచే ఎంఆర్ఎఫ్ (MRF) ప్రైవేట్ లిమిటెడ్ వారి NAFS స్కీమ్ ద్వారా అప్రెంటిస్‌షిప్ శిక్షణతో పాటు, రేన్ (మద్రాస్) లిమిటెడ్ సంస్థ ద్వారా CNC మిషన్లపై అప్రెంటిస్‌షిప్ మరియు బ్యాచిలర్ / డిప్లొమా ఇన్–వోకేషనల్ కోర్సుల్లో రెండు సంవత్సరాల శిక్షణ కోసం నిర్వహించిన ఓరియెంటేషన్ & సెలక్షన్ ప్రోగ్రామ్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యువతకు అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. నైపుణ్యాలు ఉంటేనే ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని, యువతలో స్కిల్ డెవలప్‌మెంట్ పెంపొందించాలనే లక్ష్యంతోనే ఈ శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఈ అప్రెంటిస్‌షిప్ శిక్షణలో ఉచిత శిక్షణతో పాటు స్టైపెండ్ సౌకర్యం, 100 శాతం ప్లేస్‌మెంట్ సపోర్ట్ అందిస్తున్నట్లు వివరించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మల్టీ స్కిల్స్ అవసరమని, యువత నిరంతరం నేర్చుకునే దృక్పథాన్ని అలవర్చుకోవాలని కలెక్టర్ సూచించారు. యువత తమ లక్ష్యాలను సాధించి ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు.ఈ నేపథ్యంలో తన చిన్ననాటి అనుభవాలను కలెక్టర్ గుర్తు చేసుకున్నారు. తాను పేద కుటుంబ నేపథ్యం నుంచి ఎదిగానని తెలిపారు. తన తండ్రి ఐటీఐ చదివారని, కుటుంబంలో పెద్దగా చదువుకున్న వారు ఎవరూ లేరని అన్నారు. తాను ఈ స్థితికి చేరుకోవడానికి ఎన్నో పనులు చేశానని, ఎంతో కష్టపడి చదివి ఈ స్థాయికి చేరుకున్నానని గుర్తు చేసుకున్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఉంటాయని, వాటికి భయపడి ఒకేచోట కూర్చుంటే విజయం దక్కదని అన్నారు. కష్టాలను అధిగమించి ఓర్పుతో ముందుకు వెళ్లిన వారే విజయతీరానికి చేరుకుంటారని పేర్కొన్నారు. ఈ అప్రెంటిస్‌షిప్‌లో మంచిగా శిక్షణ తీసుకొని, యువత ఉద్యోగాలను సాధించి జిల్లాకు, తమ గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.ఈ సెలక్షన్ ప్రోగ్రామ్‌కు హాజరుకాలేకపోయిన అభ్యర్థుల కోసం జనవరి 21న మరోసారి ట్రైనింగ్ & సెలక్షన్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సెలక్షన్‌లో ఎంపిక కాలేకపోయినా అభ్యర్థులు నిరాశ చెందకుండా, మరింతగా ప్రిపేర్ అయి భవిష్యత్తులో ఇంకా మంచి అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమానికి మొత్తం 107 మంది యువకులు హాజరుకాగా, వీరిలో 92 మంది తమ వివరాలను నమోదు చేసుకున్నారని తెలిపారు. నమోదు చేసుకున్న అభ్యర్థులకు మౌఖిక పరీక్షలు నిర్వహించి, వారిలో 57 మందిని వివిధ ప్రతిష్ఠాత్మక పరిశ్రమలకు ఎంపిక చేసినట్లు వెల్లడించారు. ఇందులో MRF Ltd. కంపెనీకి 39 మంది, Rane (Madras) Limited కంపెనీకి 14 మంది,టైచి కంపెనీకి 4 మంది యువకులు ఎంపికయ్యారని తెలిపారు.MRF కంపెనీలో శిక్షణ కాలంలో మొదటి సంవత్సరంలో నెలకు రూ.17,500, రెండో సంవత్సరంలో రూ.18,500, మూడో సంవత్సరంలో రూ.19,500 స్టైపెండ్ అందజేయబడుతుందని తెలిపారు. ఇందులో వసతి సౌకర్యం కోసం రూ.1,000, క్యాంటీన్ సదుపాయం కోసం రూ.350, బస్ సౌకర్యం కోసం రూ.500గా మొత్తం రూ.1,850 మినహాయించి మిగిలిన మొత్తాన్ని స్టైపెండ్ రూపంలో యువతకు చెల్లించబడుతుందని వివరించారు.రానే (మద్రాస్) కంపెనీ వారు శిక్షణ కాలంలో మొదటి సంవత్సరంలో నెలకు రూ.15,200, రెండో సంవత్సరంలో రూ.16,200 స్టైపెండ్ అందజేస్తారని, శిక్షణ పూర్తయిన అనంతరం ఎంపికైన యువతకు ప్రారంభ జీతంగా నెలకు రూ.22,000 చెల్లించబడుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో MRF కంపెనీ సూపర్‌వైజర్ అమృత్ రాజు, రానే మద్రాస్ కంపెనీ నుండి రిక్రూట్‌మెంట్ – అసిస్టెంట్ మేనేజర్ బిస్వజిట్ ఖుంటియా, SERP నుండి బి.నీలయ్య, ఏపిఎం లు ఎల్.వెంకయ్య, జి. ప్రసాద్ రెడ్డి, ఏ. నాగేశ్వర రావు, ఈ.డి.యం కలెక్టరేట్ టెక్నికల్ విభాగం అధికారులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :