తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం డిసెంబర్ 20{ తెలుగు వెలుగు} :పాత కొత్తగూడెంలో గతంలో ఇళ్ల స్థలాలు పొందిన రామవరం లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లులు కేటాయించాలని 10 వ వార్డ్ కౌన్సిలర్ మునుగడప పద్మ అధికారులకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఇందిరమ్మ స్థలాల వద్ద ఏర్పాటుచేసిన లబ్ధిదారుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ రామవరం లో 1/70 , సింగరేణి యాజమాన్యంలో స్థలాలు ఉన్నందువల్ల రామవరం లో ఇందిరమ్మ ఇల్లులకు అర్హత సాధించే అవకాశం లేకుండా పోతున్నదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రామవరం ఎంక్వయిరీ లో దరఖాస్తుదారుడుని మీకు సొంత స్థలం ఉన్నదా? ఉంటే అది ఎక్కడ ఉంది అనగా రామవరంలో అనగానే ఆ కాలంలో సొంత యజమాని అనకుండా ప్రైవేట్ ల్యాండ్ అని ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నారు. అలాంటప్పుడు రామవరం ప్రాంత ప్రజలకి ఇందిరమ్మ ఇల్లులు వర్తించటం ప్రశ్నార్ధకంగా మారిందని ఆమె అన్నారు. ఇటు పాత కొత్తగూడెం లబ్ధిదారులకు ఇల్లులు ఇవ్వకుండా, రామవరం లో ఉన్న సొంత స్థలాల లబ్ధిదారులకు ఇల్లులు మంజూరు చేయకపోతే తీరని అన్యాయం జరిగే అవకాశం ఉందని ఇది తీరని అన్యాయమని అన్నారు .అధికారులు ఇట్టి విషయాలను దృష్టిలో పెట్టుకొని పాత కొత్తగూడెం ప్రాంతంలో స్థలాలు పొందిన లబ్ధిదారులకు ప్రత్యేక పద్ధతిలో ఇల్లులు మంజూరు చేయాలని, అలాగే రామవరం ప్రాంత దరఖాస్తుదారులకు కూడా న్యాయం చేయాలని జిల్లా అధికారుల కు ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో లబ్ధిదారులు ఎం కవిత, రమ్య ,గుంజ మంగమ్మ, రాజేశ్వరి ,సాజిద, రావిచెట్టి పద్మ, నిశాంత్ ,అశోక్, ఉపతల శ్రీను ,గుంజ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ