తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అధ్యక్షతన చండ్రుగుండలో స్థానిక ఎన్నికల సన్నాహాక సమావేశంముఖ్య అతిధులుగా పాల్గొన్న టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు,జిల్లా గ్రంధాలయ చైర్మన్ వీరబాబు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు సత్తాచాటాలని టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు అన్నారు.అశ్వారావుపేట నియోజకవర్గం, చండ్రుగొండ మండలం దామరచర్ల ఎస్ఆర్ కళ్యాణమండపంలో దారం గోవింద రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అధ్యక్షతన జరిగిన స్థానిక సంస్థల సన్నాహాక సమావేశానికి టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు, జిల్లా గ్రంధాలయ చైర్మన్ వీరబాబు హాజరయ్యారు. ఈ సందర్బంగా మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, ప్రతినిలధులను ఉద్దేశించి నాగా సీతారాములు మాట్లాడుతు ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగలన్నారు. కలిసికట్టుగా పని చేస్తే విజయం మనదేనని అన్నారు. పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మనకు శ్రీరామ రక్ష అని, విడతల వారీగా 6 గ్యారెంటీల అమలతో పాటుగా హామీ ఇవ్వని పథకాలను కూడ అమలు చేస్తు ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందన్న విషయాన్ని ప్రజలకు వివరించాలన్నారు. 10 ఏళ్ళు అధికారంలో ఉండి యావత్ తెలంగాణను మోసం చేసిన బిఆర్ఎస్, కేంద్రం నుండి నిధులు కేటాయించలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్న బీజేపీ లను ఎండగట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ