తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రైతులకు సరిపడా యూరియా పంపిణీ చేయాలని, తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరతను తగ్గించాలని కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఆదేశాల మేరకు మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు సూచనలతో సోమవారం కొత్తగూడెం రైతు వేదిక ఎదుట బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బైఠాయించి నిరసన తెలిపారు. మండల వ్యవసాయ శాఖ అధికారి కరుణామయి, ఏఈఓ అనూషలకు వినతి పత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. రైతులకు యూరియా పంపిణీ చేయలేని చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులు బుద్ధి చెప్పాలన్నారు. వ్యవసాయ సీజన్లో యూరియా పంపిణీ చేయకుండా రైతులను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. చెప్పులను లైన్లో పెట్టి రైతులు రాత్రింబవళ్లు సొసైటీ కేంద్రాల ఎదుట పడికాపులు కాస్తున్నారని మండిపడ్డారు. రైతులకు యూరియా సరఫరా చేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ.. కాలం వెళ్ళదీస్తున్నారని మండిపడ్డారు. వెంటనే రైతులకు సరిపడా యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్, కౌన్సిలర్లు ప్రసాద్, తొగర్ రాజశేఖర్,రామిళ్ల మధు,సూరిబాబు, మొయినుద్దీన్ , అన్వర్,గోబ్రియా, సాంగు, పూర్ణచందర్,అశోక్ రైతులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ