తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఒరిస్సా నుండి కేరళకు తరలిస్తున్న 107 కిలోల గంజాయిని, సుమారు ₹53 లక్షల విలువైనదిగా అంచనా వేసి, స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో కేరళకు చెందిన బిలాల్, తమిళనాడుకు చెందిన శ్యామ్ సుందర్, కాశీ నందన్ సంతోష్లను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న తిరుచ్చికి చెందిన జేమ్స్ను పట్టుకోవడానికి బృందాలు ఏర్పాటు చేశారు. వీరి వద్ద నుండి డీసీఎం వ్యాన్, కారు, ఆరు సెల్ ఫోన్లు, ఐదు రివాల్వర్లు, ఒక పిస్టల్, 12 ఖాళీ మ్యాగజైన్లు, 45 బుల్లెట్లు, ₹35,500 నగదు స్వాధీనం చేసుకున్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ