Wednesday, 15 April 2026 05:19:21 PM
# ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్. # ఐదు గ్రామపంచాయతీల కోసం సమరభేరి - సోమవారం భద్రాచలంలో భారీ సభ - హాజరుకానున్న రేణుకా చౌదరి. # అంగన్వాడి కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. # 'ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా జిల్లా డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో అలవాటుగా మారే మందుల దుర్వినియోగంపై సమగ్ర అవగాహన సదస్సు . # అణగారిన వర్గాలకు అక్షరజ్యోతి ఫూలే. జ్యోతిరావు ఫూలే జీవితం ఎందరికో ఆదర్శం. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి : జిల్లా వైద్యశాఖ అధికారి డా. తుకారాం రాథోడ్. # సాదా బైనమా దరఖాస్తుల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ . # చెవి పూర్తిగా వేరైన రోగికి విజయవంతమైన శస్త్రచికిత్స – కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నైపుణ్యం # స్త్రీ శిశు సంక్షేమ పథకాల అమలులో అంగన్వాడీ సిబ్బంది ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఎమ్మెల్యే జారె. # రాష్ట్ర అవార్డులకు జిల్లా కలెక్టర్ సహకారమే మూలం ఆసుపత్రుల్లో ఎన్నో సవాళ్లకు పరిష్కారం చూపిన కలెక్టర్. # ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 13 నుండి 18 వరకు “అరైవ్ అలైవ్” కార్యక్రమం నిర్వహణ – సీఎస్ రామకృష్ణ. # నిషేధిత గంజాయిని కలిగి ఉన్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్. # దిశాకమిటీ జిల్లాస్థాయి సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే జారె.

ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలి : ఎస్పీ రోహిత్ రాజు

Date : 13 April 2026 05:07 PM Views : 54

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పాల్వంచ పోలీసుల ఆధ్వర్యంలో M.C.B.T ITI కళాశాల విద్యార్థులకు ఏర్పాటు చేసిన Arrive-Alive అవగాహనా కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎస్పీ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి,ప్రజలలో ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించాలనే దృఢ సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన Arrive-Alive-2026 కార్యక్రమంలో భాగంగా సోమవారం పాల్వంచ పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో M.C.B.T ITI కళాశాల నందు ఏర్పాటు చేసిన అవగాహనా కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పాల్గొన్నారు. ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆరు రోజుల పాటు రోడ్డు ప్రమాదాలను నియంత్రిండానికి ఏర్పాటు చేసిన Arrive-Alive campaign-2026లో భాగంగా సోమవారం నాడు విద్యార్థిని,విద్యార్థులకు అవగాహన కల్పించారు.పాల్వంచ డిఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో పట్టణ పోలీసులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో విద్యార్దినీ,విద్యార్థులు పాల్గొన్నారు.సుమారుగా 300 మంది విద్యార్థిని,విద్యార్థులు హాజరయ్యారు.ఎస్పీతో పాటు కొత్తగూడెం మున్సిపల్ కమీషనర్ సుజాత,ఆర్టీఓ వెంకటరమణ,స్థానిక కార్పొరేటర్ నూకల సరిత,మెడికల్ ఆఫీసర్ రామ్ ప్రసాద్,NHAI JE మొహమ్మద్ అలీ,ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,పాల్వంచ సీఐ సతీష్,ఎస్సైలు నాగరాజు,జీవన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ హెల్మెట్ వినియోగం,సీటు బెల్ట్ ప్రాధాన్యత,డిఫెన్సివ్ డ్రైవింగ్ నియమాల గురించి విద్యార్థులకు వివరించారు.రోడ్డు భద్రతా నియమాలను పాటించడంలో స్వీయ క్రమశిక్షణ కలిగి ఉంటే రోడ్డు ప్రమాదాలను నియంత్రిచ్చవచ్చని అన్నారు.రోడ్డుపై విధులలో ట్రాఫిక్ పోలీసులు ఉన్నా,లేకపోయినా వాహనాలను నడిపేటప్పుడు నియమ,నిబంధనలను ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించే విధంగా సివిక్ సెన్స్ ను కలిగి ఉండాలని కోరారు.జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలను గౌరవించి తమ ప్రాణ భద్రతతో పాటు,ఇతరుల భద్రతకు కూడా సహకరించాలని జిల్లా ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.డ్రంక్ అండ్ డ్రైవ్,ర్యాష్ డ్రైవింగ్,సెల్‌ఫోన్ డ్రైవింగ్,రాంగ్ రూట్,సిగ్నల్ జంపింగ్,ఓవర్ లోడ్ వలన కలిగే ప్రమాదాల గురించి వివరించారు.విద్యార్థి దశలో ప్రతి ఒక్కరూ తమ తల్లీదండ్రుల ఆశయాలకు తగ్గట్టుగా నడుచుకుంటూ మంచిగా చదువుకుని క్రమశిక్షణతో ఉన్నతస్థాయికి ఎదగాలని అకాక్షించారు.అనంతరం రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తామని కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేశారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :