తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఈ రోజు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.జిల్లా ఎస్పీ ముందుగా ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... జిల్లా ప్రజలకు,పోలీసు అధికారులకు మరియు సిబ్బందికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం కోసం,రాష్ట్ర సాధన కోసం జీవితాల్ని త్యాగం చేసిన అమరవీరుల త్యాగాలు చిరస్మరనీయమని అన్నారు.తెలంగాణ పోరాటం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ నుండే మొదలైందని గుర్తు చేశారు.ప్రశాంత వాతావరణం,శాంతి భద్రతలు అదుపులో ఉన్నప్పుడే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాది వేయడంలో పోలీస్ శాఖ పాత్ర కీలకమని, దానికనుగుణంగా అధికారులు, సిబ్బంది క్రమశిక్షణతో మరింత బాధ్యతగా పనిచేసి రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో జిల్లాకు మంచి పేరు, కీర్తి ప్రతిష్ట లు తీసుకురావాలని కోరారు.అన్ని రంగాల్లోనూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచే విధంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ జి.నరేందర్, కొత్తగూడెం డిఎస్పి రెహమాన్, డిసిఆర్బి డిఎస్పి మల్లయ్య స్వామి, ఏఆర్ డిఎస్పి సత్యనారాయణ ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, డిసిఆర్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మరియు ఇతర పోలీస్ అధికారులు, జిల్లా పోలీస్ కార్యాలయ అధికారులు, సిబ్బంది హాజరయ్యారు. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఏఆర్ డిఎస్పీ సత్యనారాయణ. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజు జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు ఏఆర్ విభాగ అధికారులు మరియు సిబ్బంది సమక్షంలో ఏఆర్ డిఎస్పి సత్యనారాయణ గారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది.
Admin
తెలుగు వెలుగు టీవీ