తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గాయత్రికి నియామక పత్రాన్ని అందించిన జిల్లా అధ్యక్షులు బైరెడ్డి.తనపై నమ్మకాన్నుంచి అధ్యక్షురాలుగా నియమించడం హర్షనీయం .ధన్యవాదాలు తెలిపిన సముద్రాల గాయత్రి. భారతీయ జనతా పార్టీ అనుబంధ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలుగా పార్టీలో సామాన్య కార్యకర్తగా పనిచేస్తున్న సముద్రాల గాయత్రిని నియమిస్తూ రాష్ట్ర పార్టీ నాయకులు ఉత్తర్వులు జారీ చేశారు. సదరు ఉత్తర్వులను ఆదివారం జిల్లా పార్టీ అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆమెకు అందించడం జరిగింది. గాయత్రిని జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలుగా నియామకం చేయడంతో జిల్లావ్యాప్తంగా నాయకులు, కార్యకర్తల్లో హర్షం వ్యక్తం అవుతుంది. ఈ సందర్భంగా గాయత్రి మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలుగా తనను నియమించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రామచంద్రరావు,బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ "మేకల శిల్పారెడ్డి, ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ బిజెపి అధ్యక్షులు, సీనియర్ న్యాయవాది జీవీకే మనోహర్, జిల్లా బిజెపి జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర, జిల్లా పార్టీ నాయకులు తనపై నమ్మకం ఉంచి జిల్లా బిజెపి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలుగా బాధ్యతను అప్పగించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. అంతేగాక మనసా వాచా కర్మణా తూచా తప్పక అందరి సలహాలు, సూచనలతో బిజెపి పార్టీని బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. అంతేగాక తెలంగాణ రాష్ట్రంలో కూడా బిజెపి అధికారంలోకి రావాలి అన్న సంకల్పంతో ఆ దిశగా అడుగులు వేస్తూ పార్టీ ఎదుగుదలకి కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నానని వివరించారు. పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లి అందరి సహకారంతో ఎండగడతానని పేర్కొన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసే విధంగా మహిళలను, కార్యకర్తలను సమీకరించి ఉద్యమాలు నిర్మింప చేస్తానన్నారు. అంతేగాక పార్టీ అధినాయకత్వం ఇచ్చిన కార్యక్రమాలు అమలు చేసేందుకు వీలుగా మహిళలు, నాయకులు, కార్యకర్తలు సహకరించాలని కోరారు.జిల్లాలోని మండల, నియోజకవర్గాలలో మహిళా కమిటీలను నియమించి పార్టీ బలోపేతానికి కృషిచేస్తా నన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ