Friday, 19 June 2026 07:07:23 PM
# టాస్క్ఫోర్స్ మరియు అన్నపురెడ్డి పల్లి పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో భారీగా 44.30 లక్షలు విలువైన గంజాయి స్వాధీనం. # కిన్నెరసానిని ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # ప్రశాంత వాతావరణంలో టీజీ టెట్ పరీక్షలు. జిల్లా కలెక్టర్ అంకిత్ . # జూలూరుపాడు ప్రభుత్వ పాఠశాల నందు సామూహిక అక్షరాభ్యాసం # వైకుంఠ రధం రిపేర్ చేయించి ఉపయోగమునకు తీసుకురావాలి. మేనేజర్ కి వినతి పత్రం అందించిన సిపిఐ జిల్లా నాయకులు మునిగడప వెంకటేశ్వర్లు. # ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మరమ్మత్తు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # అర్హుల గుర్తింపులో పారదర్శకత పాటించాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఎంఈఓలదే – జిల్లా కలెక్టర్ అంకిత్. # రాష్ట్రంలో బిజెపి జెండా ఎగిరేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి - విలేకరుల సమావేశంలో ఉదయ్ ప్రతాప్, బైరెడ్డి. # పారిశుద్ధ్య కార్మికుడు శేషు అకాల మరణం అత్యంత బాధాకరం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్. # ముఖ్యమంత్రి పంపిన లేఖ, పుష్పగుచ్ఛం అందుకోవడం సంతోషకరం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # కొత్తగూడెంలో మణుగూరు సూపర్ ఫాస్ట్ రైలు కింద పడి వ్యక్తి మృతి. # వెంకటయ్య మృతి పార్టీకి తీరని లోటు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి - ఎస్బీఐ రీజినల్ మేనేజర్ పీజీఎన్ శర్మ. # ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజుల వసూళ్లను తక్షణమే నియంత్రించాలి. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్కే షాహిద్, వరక అజిత్. # అమృత్ పథకం నిధులతో వేగవంతంగా సాగుతున్న నీటి పథకాల నిర్మాణ పనులు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన పూర్వ విద్యార్థులు. # సాధారణ ప్రసవాలను పెంచాలి – మాతృ, శిశు మరణాలను తగ్గించాలి. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. తుకారాం రాథోడ్. # జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు పటిష్టంగా అమలు చేయాలి. Dr తుకారాం రాథోడ్ DMHO. # గుడిపాడు యూపీహెచ్‌సీని సందర్శించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. తుకారాం రాథోడ్.

ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO

Date : 17 April 2026 07:07 PM Views : 268

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం డివిజన్ సూపర్ వైజర్ లు మరియు MLHP నెలవారీ సమీక్షా సమావేశంలో Dr తుకారాం రాథోడ్ మాట్లాడుతూ మారుమూల గ్రామాలలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పటిష్ఠంగా పనిచేయాలని గ్రామీణ ప్రజలలో ఆరోగ్యం పై అవగాహన కల్పించాలని వారికి అనారోగ్యం వారిన పడే అవకాశాలను తగ్గించాలని, ఆహారపు అలవాటు మార్చుకోవాలని, సమతుల ఆహారం తీసుకోవాలని, ఆకుకూరలు , పండ్లు , కూరగాయలు, కార్బోహైడ్రేట్స్ , ప్రోటీన్స్, తృణ ధాన్యాలు, తీసుకోవాలని, జంతు సంబంధ ప్రోటీన్ల కంటే వృక్ష సంబంధమైన ప్రోటీన్లు తీసుకోవడం ద్వారా కొలెస్ట్రాల వారిని పడకుండా జాగ్రత్త తీసుకోవాలని తెలియజేశారు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లలో ప్రతి నెల 12 రకాల ఆరోగ్య సేవలు మీద హెల్త్ ఆక్టివిటీస్ నిర్వహించాలని ప్రతి ఆక్టివిటీల్లో గ్రామ ప్రజలను సమీకరించి ఆరోగ్య విద్య బోధన చేయాలని, యోగ ఆసనాలు, నడక, జుంబా, సైక్లింగ్, ప్రాణాయామం , గర్భిణీలకు సాధారణ కాన్పు అయ్యే లాగా చిన్నచిన్న ఎక్సర్సైజులు చేపించడం ద్వారా అవ్వడం సాధారణ కాన్పులు అయ్యే అవకాశం ఉందని సిజేరియన్ ఆపరేషన్లు తగ్గించవచ్చు అని తెలియజేశారు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ లో పనిచేస్తున్న సిబ్బంది వారి లక్ష్యాలు చేరుకోవాలని వారి నైపుణ్యాలు మెరుగుపరుచుకోవాలని, ఓకే మెడ నొప్పి మోకాళ్ళ నొప్పి దీర్ఘకాలిక రోగులకు వయోవృద్ధులకు, గర్భిణీలకు, అందరికీ కూడా ఫిజియోథెరపీ ఎక్సర్సైజులు ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కేంద్రాల్లో నిర్వహించాలని తెలియజేశారు.పెయిన్ కిల్లర్ మందులు , డైక్లోఫెనాక్ ఇంజక్షన్లు వాడకుండా సాధారణ శారీరిక శ్రమ ఫిజియోథెరపీ ద్వారా నొప్పులను తగ్గించుకోవాలని తెలియజేశారు.కొత్తగూడెం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి నందు పాలియేటివ్ కేర్ సేవలు అందుబాటులో ఉన్నాయని ఇక్కడ రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి డయాలసిస్ వారికి క్యాన్సర్ రోగులకు దీర్ఘకాలికంగా మంచంలో ఉన్న వారికి సేవలు అందిస్తారని తెలియజేశారు ఈ అవకాశాన్ని కొత్తగూడెం జిల్లా ప్రజలు వినియోగించుకోవాలని తెలియజేశారు.ఎండాకాలం దృష్ట్యా ఉదయం 11 గంటల లోపు వ్యక్తిగత పనులు ముగించుకొని ఇంటికి చేరుకోవాలని మధ్యాహ్న సమయంలో ఎండకు బయట తిరగకుండా జాగ్రత్త తీసుకోవాలని వడదెబ్బ తగలకుండా చూసుకోవాలని సమృద్ధిగా నీరు తీసుకోవాలని, ORS పాకెట్స్ అందుబాటులో ఉంచుకోవాలని తెలియజేశారు రవాణా సౌకర్యం లేని మారుమూల ప్రాంతాల్లో గర్భిణీ స్త్రీలకు ముందుగానే బర్త్ ప్లాన్ చేసి ఆ దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి తరలించాలని తెలియజేశారు , సూపర్వైజర్లు ఆరోగ్య సిబ్బంది అందరూ కూడా కంప్యూటర్ పరిజ్ఞానం పెంచుకోవాలని ఆన్లైన్ డేటా ఎంట్రీ వివరాలు గూర్చి అవగాహన పెంచుకోవాలని, అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై పూర్తి పరిజ్ఞానం ఉండాలని గ్రామసభలలో ప్రజలకు ఆరోగ్య కార్యక్రమాలపై ఆరోగ్య విద్యా బోధన చేయాలని తెలియజేశారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ చక్కగా పనిచేసే వారి అందుబాటులో ఉన్న ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకెళ్లాలని ప్రభుత్వ పాఠశాలలో ప్రవేట్ పాఠశాలలో అంగన్వాడీ కేంద్రాల్లో కళాశాలలో విద్యార్థులకు ఆరోగ్య విద్య బోధన వ్యక్తిగత పరిశుభ్రత కౌమార దశలో పిల్లలకు వయసులో వచ్చే మార్పుల గురించి అవగాహన కల్పించాలని తెలియజేశారు.జీవనశైలి వ్యాధుల గురించి అవగాహన పెంచుకొని మనం తీసుకునే ఆహారపు అలవాట్లను మార్చుకొని ప్రశాంతమైన జీవనం గడిపినట్లయితే బీపీ , షుగర్ వ్యాధులను తగ్గించుకోవచ్చని తెలియజేశారు.గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ రాకుండా నివారించే HPV వ్యాక్సిన్ 14 సంవత్సరాల నుండి 15 సంవత్సరాలు లోపు ఉన్న యుక్త వయసు బాలికలకు అందరికీ HPV వ్యాక్సిన్ వేయాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో Dr సాయి కళ్యాణ్ డిప్యూటీ డిఎంహెచ్ఓ కొత్తగూడెం డాక్టర్ ప్రసాద్ డాక్టర్ ప్రతాప్ డాక్టర్ రామదాసు డాక్టర్ దినేష్ డాక్టర్ రాకేష్ డాక్టర్ హరీష్ ప్రోగ్రామ్స్ ఆఫీసర్స్ పాల్గొని ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు.అదే విధంగా జూలూరు పాడు ఆరోగ్య కేంద్రం కూడా సందర్శించి హెచ్ పి వి వాక్సిన్ గురించివివరించడంజరిగినది.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: