తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : బిడ్డలకు జన్మనిచ్చి భరతమాత ఒడిలో ఉన్న బిడ్డలను పహల్గామ ఉగ్ర దాడిలో శత్రుదేశం నుండి కాపాడేందుకు వీరులను పంపిన ప్రతి తల్లికి ఇదే మా పాదాంజలి. ఆపరేషన్ సింధూర్ బాధ్యతలో ఉన్న వీరవనితలు మహిళా కమాండర్ సోఫియా కురేషి, వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్ భరతమాత సింధూరం మహాశక్తిని చూపించిన మీకు ఇవే మా వందనాలు అంటూ ఉన్నదాసు గడ్డలో మాజీ కౌన్సిలర్లు మునిగడప పద్మ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో మాతృ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లి లేనిదే మనకు జన్మ లేదని ఆ తల్లి నవ మాసాలు మోసి ఎన్నో బాధలకు ఓర్చుకొని జన్మనిచ్చిన బిడ్డలను మంచి బాటలో నడిపించాలని వారి ఎదుగుదలే తన సంతోషమని జీవిస్తుందని వారు అన్నారు . ఆ తల్లికి మనం ఎంతో రుణపడి ఉండాలని నేటి ఆధునిక సమాజంలో తల్లిదండ్రులను చూడనటువంటి కొంత దుర్మార్గ వ్యవస్థ ఉన్నదని అలాంటి వ్యవస్థను ఈ మదర్స్ డే నుండైనా మార్చాలని అన్నారు. తల్లులను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుల్లో ఉంటుందని ఈ సందర్భంగా వారు అన్నారు. భరతమాతను కాపాడే పదో వార్డుకు చెందిన తెలగరి అభిలాష్, బానోత్ గౌతమ్ బిడ్డలను కన్న తేలగరి మాణిక్యమని, బానోతు సుశీల తల్లులు మన ఇండియన్ ఆర్మీకి అందించి నేటి యుద్ధంలో భాగస్వాములను చేసిన వారిని శాలువాతో ఘనంగా సత్కరించారు. అలాగే ఉన్నందాస్ గడ్డ వృద్ధాప్య తల్లులను శాలువాతో సత్కరించి కేక్ కట్ చేసి అందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో శాఖ కార్యదర్శి సూరి మేని జనార్ధన్ ,ఎస్కే జలీల్, బానోతు చందర్, సిపిఐ సీనియర్ నాయకులు కట్ట సత్యనారాయణ, అస్మత్ పాషా, షణ్ముఖ చారి ,రమేష్, మునిగడప స్వరాజ్యం, ముద్దం మార్తమ్మ, బానోతు కమల, సత్యవతి, తెలగరి సౌజన్య ,పద్మక్క, శ్రీదేవి, కవిత తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ