తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : డిగ్రీ ప్రవేశాలకు గడువు పొడిగింపు డిగ్రీ ప్రవేశాలకు రిజిస్ట్రేషన్ గడువును ఈనెల 25వ తేదీ వరకు పొడిగించినట్లు పాల్వంచ సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బోయిన ఝాన్సీ రాణి తెలిపారు. బీకాం(జనరల్, సీఏ), బీఎస్సీ (BZC, MZC, MPC, MPCS), బీఏ కోర్సుల్లో ప్రవేశాలకు అవకాశం ఉందని తెలిపారు. ఈనెల 25వ తేదీలోపు దోస్త్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Admin
తెలుగు వెలుగు టీవీ