తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం : ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ తెలంగాణ (కరాటే" కుంగ్-ఫు" టైక్వాండో" సిలంబం") కు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా కొత్తగూడెంకు చెందిన ప్రముఖ కుంగ్-ఫు కరాటే మాస్టర్ మాజీ అంతర్జాతీయ కరాటే క్రీడాకారుడు పి.కాశీ హుస్సేన్ ఎన్నికయ్యారు.ఈనెల 10వ తేదీన సినీ హీరో ప్రముఖ కరాటే మాస్టర్ డాక్టర్ సుమన్ అధ్యక్షతన హైదరాబాదులో జరిగిన ఆల్ స్టైల్ మార్షల్ట్స్ ఆర్ట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ తెలంగాణ (కరాటే, కుంగ్-ఫు, టైక్వాండో ,సిలంబం,) సమావేశంలో కమిటీ సభ్యులు కాశీ హుస్సేన్ గత 35 సంవత్సరముల నుండి కుంగ్-ఫు,కరాటే, కిక్ బాక్సింగ్, రెజ్లింగ్ పలు మార్షల్ ఆర్ట్స్ లలో వేలాది మందికి శిక్షణ ఇస్తూ వివిధ క్రీడ అసోసియేషన్లకు రాష్ట్ర, జాతీయ స్థాయిలలో అనేక పదవులను నిర్వహించిన అనుభవం ఉండడంతో ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ ఆర్గనైజేషన్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా కాశీ హుస్సేన్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ ఆర్గనైజేషన్ కు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన కాశీ హుస్సేన్ కు జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ చీఫ్ ఫ్యాట్రన్స్ నాగ సీతారాములు, యస్.కె.సాబీర్ పాషా, జిల్లా జూడో అసోసియేషన్ అధ్యక్షులు ఐ.ఆదినారాయణ, జిల్లా కిక్ బాక్సింగ్ అసోసియేషన్ కార్యదర్శి పి.నిహారిక, జిల్లా ఇండియన్ స్టైల్ రెస్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బరిగెల భూపేష్ , జిల్లా కుంగ్ ఫు మాస్టర్స్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేష్, ఉపాధ్యక్షులు వై. సుబ్రహ్మణ్యం, రాజా, పలు క్రీడా సంఘాల ప్రతినిధులు, కోచ్ లు, సీనియర్ క్రీడాకారులు అభినందించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ