Sunday, 19 April 2026 02:44:23 PM
# గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్.

అశ్వరావుపేట నియోజకవర్గ అభివృద్ధి పనులపై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.

Date : 20 August 2024 09:10 PM Views : 600

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / అశ్వారావుపేట : అశ్వారావుపేట మండలంలో పర్యటించిన మంత్రి పొంగులేటి, నారాయణ పురం,వినాయక పురం గ్రామాల్లో నూతనంగా నిర్మించిన పంచాయితీ కార్యాలయ భవనాలను ప్రారంభించిన మంత్రి. అనంతరం అశ్వారావుపేట పట్టణంలోని శ్రీ శ్రీ కల్యాణ మండపంలో అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. తెలంగాణా రాష్ట్రాన్ని గత పది సంవత్సరాలు పాలించిన పెద్దోళ్ళు అవాకులు చవాకులు పేలుతున్నారు.. కావాలని రైతులను రెచ్చగొట్టే ప్రక్రియలు చేస్తున్నారు.. ఏ ఒక్క రైతు అభద్రత భావనకు లోనవ్వొద్దు.. ఇప్పటికే వేల కోట్ల రైతు రుణమాఫీ చేశాము.అర్హులైన వారికి ఇంకా ఎన్ని వేల కోట్ల రుణమాఫీ అయిన ఈ ప్రభుత్వం చేయటానికి సిద్ధంగా ఉంది. ఇది పేదోడి ప్రభుత్వం. ఇందిరమ్మ రాజ్యం. ఇచ్చిన మాట ప్రకారం నెరవేర్చటమే లక్ష్యంగా పనిచేస్తుంది. రైతులను రెచ్చగొట్టే పనులు చేస్తే సహించేదే లేదు కనీసం ప్రతి పక్ష హోదాని కూడా దక్కించుకోలేని స్థితిలో ఆ పార్టీ ఉంది అంటూ సెటైర్లు వేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. అటవీశాఖ అధికారులను భూ సర్వే విషయంలో రైతులతో అతి ఉత్సాహం చెయ్యద్దంటు చెప్పిన మంత్రి పొంగులేటి.

అనంతరం ఇరిగేషన్ ఈ ఈ శ్రీనివాస్ పై పొంగులేటి ఫైర్.. పొంగులేటి అడిగిన ఏ ఒక్క విషయానికి సరైన జవాబు చెప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అశ్వారావుపేట నియోజకవర్గ పరిధిలో అన్ని గ్రామాల్లో ఇళ్ళ పై వెళ్ళిన హైటెన్షన్ వైర్లను ఎటువంటి ఎస్టిమోషన్స్ ప్రజల పై వేయకండ డిపార్ట్మెంట్ నుండే క్లియర్ చేయాల్సిందిగా విద్యుత్ శాఖ కు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో వైద్యశాఖ అధికారులు వైద్యులు ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండాలని, హాస్పటల్ ఆకస్మిక తనిఖీలు చేస్తామని అలసత్వం ప్రదర్శించిన వైద్యులు లేదా వైద్య సిబ్బంది పై కఠిన చర్యలుతీసుకుంటామని వైద్యశాఖ అధికారులను హెచ్చరించారు. విద్యాశాఖాధికారులతో మాట్లాడుతూ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అసంపూర్తిగా ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మరియు టీచర్ల సర్దుబాటు ప్రక్రియను పూర్తిచేయాలని మంత్రి ఆదేశించారు. గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే మహిళా శక్తి రుణాలు అర్హులైన మహిళా సంఘాలను గుర్తించి స్థానిక శాసనసభ్యుల అనుమతితో మంజూరు చేయాలనిమంత్రి ఆదేశించారు. పర్యటనలో మంత్రితో పాటు పాల్గొన్న ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి,ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్,ఎస్పీ రోహిత్ రాజ్,మువ్వా విజయ్ బాబు మరియు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :