Tuesday, 26 May 2026 11:25:37 PM
# సిపిఐ జిల్లా కార్యాలయంలో ఘనంగా గిరిప్రసాద్ 29వ వర్ధంతి. # జర్నలిస్టుల హక్కుల రక్షణకు, సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # రేషన్ డీలర్ల జిల్లా స్థాయి సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # ఎండ తీవ్రత ప్రాంతాల్లో రోడ్లపై నీళ్లు చల్లాలి. సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి ఎండ తీవ్రత కారణం. 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ డిమాండ్. # దళితుల అభ్యున్నతికి విశేష కృషి చేసిన మహనీయుడు భాగ్యరెడ్డి వర్మ : జిల్లా కలెక్టర్ అంకిత్. # జనగణన హౌస్ లిస్టింగ్‌లో ఖచ్చితత్వానికి ప్రాధాన్యం ఇవ్వాలి - డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ భారతి హోలీకేర్. # కాంట్రాక్ట్ కార్మికులకు పెండింగ్ సర్క్యులర్స్ ను విడుదల చేయాలి. ఏఐటీయూసీ కొత్తగూడెం రీజియన్ కార్యదర్శి యర్రగాని కృష్ణయ్య. # ఉద్యోగులు సమయపాలన పాటించాలి. ఐడీఓసీ కార్యాలయంలోని వివిధ శాఖలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్. # చండ్రుగొండ మండల కేంద్రం బస్ స్టేషన్ లో ని మరమ్మతు ల పనులను పరిశీలించిన అశ్వరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు జారే ఆదినారాయణ # 23వ డివిజన్లో ముఖ్య కార్యకర్తల సమావేశం. టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు పిలుపు. # ప్రజా ఆరోగ్యం పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # ఓటర్ల జాబితా సమగ్ర సవరణకు పార్టీ శ్రేణులు సహకరించాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # ఉపాధి హామీ నిధులతో చేపట్టిన పనులను వేగవంతం చేయాలి. ఉపాధి హామీ కూలీల సంఖ్యను పెంచాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # రైతులకు ఇబ్బందులు లేకుండా మొక్కజొన్న కొనుగోళ్లు చేపడుతున్నాం - జిల్లా కలెక్టర్ అంకిత్. # కాంగ్రెస్ పార్టీ 21 వ డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశం. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగా సీతారాములు పిలుపు. # జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు గల పోలీస్ ఫైరింగ్ రేంజ్ నందు జిల్లాలోని పోలీసు అధికారులు,సిబ్బందికి యాన్యువల్ ఫైరింగ్ ప్రాక్టీస్. # ప్రాణాపాయ స్థితిలో 8 ఏళ్ల బాలుడు. దాతల సహాయం కోసం తల్లిదండ్రుల వేడుకోలు. # చండ్రుగొండ మండలం, దామెరచర్లలో ఆగ్రహించిన అన్నదాత. # ఫిట్ అండ్ యాక్టివ్ తెలంగాణ 2K రన్‌లో ఉత్సాహంగా పాల్గొన్న ఎమ్మెల్యే జారె.

యువత క్రీడా, సాంస్కృతిక రంగాలపై ద్రుష్టి సారించాలి : సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా

Date : 03 May 2026 05:43 PM Views : 135

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : క్రమశిక్షణ, పట్టుదలే యువతను ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడాస్ఫూర్తిని చాటాలి వేసవి ఎండల దృష్ట్యా క్రీడాకారులు జాగ్రత్తలు తీసుకోవాలి స్నేహపూర్వక వాతావరణంలో ప్రతిభను నిరూపించుకోవాలి సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా యువత క్రీడా, సాంస్కృతిక రంగాలపై దృష్టి సారించాలని, అప్పుడే సమగ్ర వ్యక్తిత్వ వికాసం సాధ్యమవుతుందని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా అన్నారు. కొత్తగూడెం పట్టణంలోని ప్రగతి మైదాన్'లో ఆదివారం స్టాలిన్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రగతి ప్రీమియర్ లీగ్ సెషన్-2 క్రికెట్ టౌర్నమెంటును కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్‌తో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా సాబీర్ పాషా మాట్లాడుతూ క్రమశిక్షణ, పట్టుదల ఉంటేనే యువత జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోగలరని పేర్కొన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, వాటిని సమానంగా స్వీకరిస్తూ మైదానంలో నిజమైన క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాలని క్రీడాకారులకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం వేసవి ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున క్రీడాకారులు ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, డీహైడ్రేషన్ బారిన పడకుండా జాగ్రత్త పడాలని సూచించారు. మైదానంలో స్నేహపూర్వక వాతావరణంలో ఆడుతూ ప్రతి ఒక్కరూ తమలోని ప్రతిభను నిరూపించుకోవాలని ఆయన ఆకాంక్షించారు. క్రీడలు శారీరక దృఢత్వానికే కాకుండా, యువతలో ఐక్యతను పెంపొందించడానికి దోహదపడతాయని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో 50 డివిజన్ కార్పొరేటర్ దాసరి శ్రీనివాస్, నిర్వాహక కమిటీ సభ్యులు స్టాలిన్, జేమ్స్, అజయ్, చక్రధర్, బిట్టు, సాయి, అజయ్, భరత్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :