Monday, 20 April 2026 01:47:41 PM
# అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ MLA,BRS పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు నేడు అశ్వారావుపేట మండలంలో విస్తృతంగా పర్యటించారు. # వైద్య ఖర్చులకు లక్ష రూపాయల ఎల్ఓసి మంజూరు చేసిన ఎమ్మెల్యే జారె. # మహా కుంభాభిషేకానికి రావాల్సిందిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆహ్వానించిన ఎమ్మెల్యే జారె. # గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ.

సమాజంలో జర్నలిస్టుగా పనిచేయడం ఎంతో అదృష్టం సీనియర్ జర్నలిస్ట్ సూర్యనారాయణ

Date : 27 October 2025 12:49 PM Views : 243

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రజాస్వామ్యంలో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్న పత్రికా రంగంలో జర్నలిస్టుగా పనిచేయడం ఎంతో అదృష్టమని సీనియర్ జర్నలిస్ట్ ఎస్వి సూర్యనారాయణ అన్నారు. 1983 ఆగష్టులో ఇల్లందులో అడుగుపెట్టి వివిధ పత్రికలలో జర్నలిస్టుగా పనిచేసిన సూర్యనారాయణ 42 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా మిత్రులు, శ్రేయోభిలాషులు గురువారం 42 వసంతాల వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో సూర్యనారాయణ మాట్లాడుతూ పాత్రికేయ రంగ విశిష్టతను వివరించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కృషిచేయడానికి, సమాజానికి విశేషంగా సేవలందించడానికి ఎంతో బాధ్యతాయుతమైన పాత్రికేయ వృత్తి గొప్ప అవకాశాన్నిస్తుందని ఆయన అన్నారు. నాలుగు దశాబ్దాల క్రితమే జర్నలిస్టుగా పనిచేసే అవకాశం తనకు లభించిందని ఆయన హర్షం వ్యక్తం చేసారు. జీవితంలో ఒక ఉత్తమ జర్నలిస్ట్గా రాణించాలనే తన ఆశయం దైవానుగ్రహంవల్ల ఇల్లందులోనే నెరవేరిందని, తన పాత్రికేయ ప్రస్థానంలో ఇల్లందు ఒక మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. ఆంధ్రప్రభ, ఇండియన్ ఎక్స్ ప్రెస్లోనే తన పాత్రికేయ వృత్తి ప్రారంభమైనదని, ఈ రెండు దినపత్రికలు తనను ఒక మంచి జర్నలిస్ట్గా తీర్చిదిద్దాయని, ఈ విషయం ఎప్పటికీ మరువలేనిదని అన్నారు. వృత్తిలో ఎంతోమంది ప్రతిభావంతులైన జర్నలిస్టులతో కలిసి పనిచేసే అవకాశం తనకు లభించిందని, వృత్తిలో ఉన్నత ప్రమాణాలను పాటిస్తూ, అంకితభావంతో విధులను నిర్వర్తించి ప్రజల ఆదరణ పొందటం ఎంతో ఆనందాన్నిచ్చిందని అన్నారు. నాలుగు దశాబ్దాల క్రితం సమాజంలో జర్నలిస్టులు చాలా తక్కువమంది వుండేవారని, జర్నలిస్టులపట్ల ప్రజలకు ప్రత్యేక గౌరవం వుండేదని, అప్పట్లో జర్నలిస్టునని చెప్పుకోవడం గర్వకారణంగా వుండేదని అన్నారు. గతంలో జర్నలిస్టుగా పనిచేయాలనే ఆసక్తి చాలామందికి వుండేదని, కానీ సమకాలీన సామాజిక పరిస్థితులపట్ల చక్కటి అవగాహన, భాషాపరిజ్ఞానం, వృత్తిపట్ల అంకితభావం కలవారు మాత్రమే అప్పట్లో జర్నలిస్టులుగా ఎంపికయ్యేవారని ఆయన స్పష్టం చేసారు. నేడు పత్రికా రంగంలో సాంకేతిక పరిజ్ఞానం విశేషంగా అభివృద్ధి చెందిందని, ఎటువంటి వ్యయప్రయాసలు లేకుండా జర్నలిస్టులు వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు ప్రజలకు అందజేస్తుంటారని అన్నారు. కాలానుగుణంగా దినదినాభివృద్ధి చెందుతున్న పత్రికా రంగంలో ఉన్నత ప్రమాణాలు పాటిస్తూ అంకితభావంతో విధులను నిర్వర్తించి వృత్తి గౌరవాన్ని పెంచవలసిన బాధ్యత జర్నలిస్టులపై వుందని అన్నారు. ప్రజాస్వామ్యంలో జర్నలిస్టుల పాత్ర విశిష్టమైనదని, వార్తల రూపంలో వాస్తవాలను ప్రజలకు అందజేస్తున్న జర్నలిస్టులు అభినందనీయులని ప్రశంసించారు. ఆదర్శవంతమైన ఆశయాలతో తమ విశేష ప్రతిభా పాటవాలతో పాత్రికేయ రంగానికి బంగారు బాటలు వేసిన జర్నలిస్టులను తలుచుకుంటే ఎంతో ధైర్యం, స్ఫూర్తి కలుగుతుందని అన్నారు. పాత్రికేయ రంగం విశేషంగా అభివృద్ధి చెందాలనే ఆశయంతో పనిచేసిన జర్నలిస్టులు తమ లక్ష్యసాధనలో సఫలీకృతులయ్యారని అన్నారు. సమాజసేవలో జర్నలిస్టుగా తాను నిజమైన సంతృప్తిని పొందానని ఆయన అన్నారు. సమాజంలో వృత్తినే దైవంగా భావించి సంవత్సరాల తరబడి పత్రికా రంగంలో విశేష సేవలందించిన జర్నలిస్టులను గుర్తించవలసిన అవసరం ఎంతైనా వుందని అన్నారు. జర్నలిజం ఒక మహాసముద్రమని, ఈ రంగంలో ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవలసినది | వుంటూనే వుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. రానున్న కాలంలో మీడియా రంగం ఉజ్వలమైన భవిష్యత్తును కలిగి వుండాలని, జర్నలిస్టులకు ఎంతో మేలు జరగాలని ఆయన ఆకాంక్షించారు. ఎస్.వి. సూర్యనారాయణ సీనియర్ జర్నలిస్ట్ ໑໘໐໖. 9848758175

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :