తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని రామవరం 16వ డివిజన్లో భారత గడ్డపై వందేళ్లు పూర్తి చేసుకున్న భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జండాలు రెపరెపలాడాయి. శుక్రవారం నేతాజీ బస్తి నాగయ్య గడ్డ ఇందిరమ్మ కాలనీలో సీనియర్ సిపిఐ నాయకులు కొంకుల దుర్గయ్య ఎస్కే అమీద చేతుల మీదుగా వందేళ్ల చరిత్ర కలిగిన సిపిఐ జెండాను ఆవిష్కరింపజేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు మునిగడప పద్మ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తుపాకి గుండ్లకు ఎదురెొడ్డి మరణాన్ని ముద్దాడినా సరే ఆశయాన్ని వదలని అసంచలమైన చరిత్ర మన ఎర్రజెండాది అని వారు అన్నారు. భారత రాజకీయ యవనికపై ఒక ప్రభంజనముల ఉద్భవించిన భారత కమ్యూనిస్టు పార్టీ 100 వసంతాలు పూర్తి చేసుకోవడం ఒక భారత కమ్యూనిస్టు పార్టీకే దక్కింది అని పేర్కొన్నారు. 1925లో కాన్పూర్ వేదికగా ప్రారంభమైన ఈ ప్రయాణం కేవలం ఒక ప్రస్థానం కాదు, ఇది పీడిత ప్రజల పోరాట చరిత్ర ,కార్మికుల చెమట చుక్కల సాక్షిగా సాగిన ఉద్యమ ప్రస్థానం మన ఎర్రజెండాది అని అన్నారు. ఈ తరుణంలో మీ అందరి ముందు నిలబడటం మాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నాం. ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే దానికి కారణం ఎర్రజెండా నేర్పిన పోరాట పటిమ, ప్రజల పట్ల ఉండవలసిన బాధ్యత అని అన్నారు. ఎర్రజెండా అడ్డ మన కొత్తగూడెం ప్రాంతం అంటేనే పోరాటాలకు పురిటి గడ్డ వారు అని వారన్నారు. మన నియోజకవర్గ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పార్టీ అంటే ఒక రాజకీయ పక్షం కాదని ,ఒక నమ్మకమని ఆ నమ్మకానికి నిలువెత్తు రూపమే కూనంనేని అని, ఆయనను ఆదర్శంగా తీసుకొని పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా వివక్ష లేకుండా పనిచేయడమే మా లక్ష్యం అని అన్నారు. మన వార్డులో ఎర్రజెండాను మరింత బలోపేతం చేసి, ప్రతి ఇంటికి పార్టీ ఆశయాలను చేరుస్తామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నామని అన్నారు. అనంతరం సీనియర్ నాయకులను శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో శాఖ కార్యదర్శిలు ముద్దం మార్తమ్మ ,ఉపతల శ్రీను, ఉన్నందాస్ గడ్డ శాఖ1 కార్యదర్శి తోగరు నరేంద్ర కుమార్, సీనియర్ నాయకులు బొల్లెద్దుల అజరయ్య, ఆది మల్లయ్య ,తమ్మ బాబురావు, బయన ఈశ్వరయ్య, కం పెళ్లి దుర్గయ్య ,సూర్మేని రామారావు, కొంకుల దుర్గయ్య ,గుత్తుల నాగేశ్వరరావు, సాయిలు, చాంద్ పాషా, ర్గనైజింగ్ కార్యదర్శి గుంజా వెంకన్న , శెట్టిరాజు, వెంకన్న ,అబ్బాస్, విజయ్, సనం ,శివ మహిళలు ఆమీద, రహీన ,నూరి, చల్ల రమ్య, ఉమా, రాజేశ్వరి, కోటేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ