తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అశ్వారావుపేట మండలంలోని అనంతారం గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల మరియు పెద్దవాగు ప్రాజెక్ట్ పరిధిలో ఉన్న గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలను సందర్శించారు ఈ సందర్భంగా పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల విద్యా సామర్థ్యం వసతి సదుపాయాలను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు త్వరలో జరగనున్న పదవ తరగతి పరీక్షలు దృష్టిలో పెట్టుకొని విద్యార్థులు మంచి ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు ప్రతి విద్యార్థి పై వ్యక్తిగత దృష్టి పెట్టి ప్రత్యేకంగా బలహీనంగా ఉన్న విద్యార్థులకు అదనపు తరగతులు నిర్వహించి ఉత్తీర్ణత శాతాన్ని పెంచేలా కృషి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు గిరిజన ప్రాంతాల విద్యార్థులు కూడా ఉన్నత విద్యను సాధించి మంచి భవిష్యత్తు నిర్మించుకోవాలని ప్రభుత్వం విద్యార్థుల అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తుందని పేర్కొన్నారు పాఠశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ