Sunday, 19 April 2026 02:05:30 PM
# గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్.

నిషేధిత సిపిఐ మావోయిస్టుల కదలికలపై అప్రమత్తంగా ఉంటూ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసుకోవాలి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్

Date : 08 November 2024 07:14 PM Views : 627

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈ రోజు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ఏడూళ్ల బయ్యారం మరియు కరకగూడెం పోలీస్ స్టేషన్లను సందర్శించారు.అక్కడ విధులలో ఉన్న పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి పలు సూచనలు చేశారు.మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లలో పనిచేసే పోలీస్ అధికారులు,సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ వారి కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.వివిధ సమస్యలతో పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులకు న్యాయం చేకూర్చే విధంగా బాధ్యతగా విధులు నిర్వర్తించాలని తెలిపారు.ముందుగా పోలీస్ స్టేషన్లో పనిచేసే సిబ్బందికి పోలీస్ శాఖ తరఫున కేటాయించిన ప్రభుత్వ సామాగ్రిని పరిశీలించారు.అనంతరం పోలీస్ స్టేషన్లలో నమోదైన పలు కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.విధులపరంగా మరియు వ్యక్తిగతంగా ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని పోలీస్ అధికారులకు మరియు సిబ్బందికి సూచించారు.వర్తికల్స్ వారీగా ఎవరికి కేటాయించిన విధులను వారు సమర్థవంతంగా నిర్వర్తించాలని,ఏజెన్సీ ప్రాంతంలో నివసించే ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని కోరారు.కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే యువత అందరికి చదువుతోపాటు క్రీడలలో కూడా రాణించే విధంగా పలు పలు కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని సూచించారు.అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజల సమస్యలు తెలుసుకుని సంబంధిత అధికారులతో మాట్లాడి ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడుళ్ల బయ్యారం సీఐ వెంకటేశ్వర్లు,కరకగూడెం ఎస్సై రాజేందర్,ఏడూళ్ల బయ్యారం ఎస్సై రాజ్ కుమార్ మరియు టిఎస్ఎస్పి అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :