తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మానవసేవే, మాధవ సేవ, యేసు అనుసరించిన మార్గాన్ని మనమందరం ఆచరించాలని సిపిఐ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పద్మా వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. గురువారం 16వ డివిజన్ లోని ఆనంద్ పాల్ పాస్టర్ చర్చిలో జరిగిన ఏసుక్రీస్తు పుట్టిన రోజు సందర్భంగా క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని క్రిస్టియన్ సోదరి, సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసి ఆయన మాట్లాడుతూ తోటి వారిని ప్రేమించు, ఆపదలో ఉన్న వాడిని ఆదుకోండి, సేవా గుణాన్ని అలవర్చుకోవడం, పాపులను క్షమించడం ఏసుక్రీస్తు అందించినటువంటి వీటి ద్వారా మనం విశ్వమానవాళికి సేవ చేసే అవకాశం ఏసుక్రీస్తు కల్పించాలని ఆయన పేర్కొన్నారు ఈ యొక్క కార్యక్రమంలో ఆనంద్ పాస్టర్ దంపతులు, కంచి యోహాన్, ఎస్తేరు దంపతులు, మరియు పొల్లెద్దుల నిశాంత్, సతీష్ సంఘ కాపరులు అందరు కూడా పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ