తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం డిసెంబర్ 7 (తెలుగు వెలుగు) జూలూరుపాడు మండలం కాకర్ల క్లస్టర్ నందు గత కొంతకాలంగా ఏఈఓ గా బాధ్యతలు నిర్వహిస్తున్న సిలివేరి లావణ్య ఏవోగా ఉద్యోగున్నతి పొంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం వెళ్లారు. ఈరోజు కాకర్ల రైతు వేదిక నందు రైతులు మరియు సహ ఉద్యోగులు కలిసి లావణ్య కు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. రైతులు మాట్లాడుతూ గత కొంతకాలంగా మాకు ఎన్నో విధాలుగా వ్యవసాయానికి సంబంధించిన సూచనలు, సలహాలు ఇచ్చేవారని ఉద్యోగోన్నతి పొందినందుకు సంతోషంగా ఉన్న మమ్మలని వదిలి వెళ్ళినందుకు బాధగా ఉందని కొంతమంది రైతులు వాపోయారు.
ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి దీపక్ ఆనంద్, ప్రస్తుత ఏ ఈ ఓ సరిత, గోపాలకృష్ణ, కాకర్ల సెక్రటరీ నాని బాబు, సహకార సంఘం అధ్యక్షుడు చీమలపాటి బిక్షం, మాజీ ఎంపీటీసీ పొన్నెకంటి సతీష్, టిఆర్ఎస్ నాయకులు యదలపల్లి వీరభద్రం, రైతులు చలువాది వెంకటేశ్వర్లు, ఉసికెలశ్రీను, మరి కొంతమంది రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ