తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈ రోజు అనగా 09.05.2025 తేదీన నిషేదిత CPI మావోయిస్టు పార్టీకి చెందిన (38) మంది సభ్యులు జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోవడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు మరియు 81BN & 141 BN CRPF అధికారులు ఆదివాసీ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కొరకు నిర్వహిస్తున్న కార్యక్రమాలు మరియు "ఆపరేషన్ చేయూలో" కార్యక్రమం ద్వారా లొంగిపోయిన మావోయిస్టు సభ్యులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంమరియు తెలంగాణ పోలీసు శాఖ కల్పిస్తున్న సౌకర్యాల గురించి తెలుసుకుని, నక్సలిజాన్ని విడిచిపెట్టి ఇకపై తాము కూడా కుటుంబ సభ్యులతో కలిసి నిర్మలమైన జీవితం గడపాలని నిర్ణయించుకొని వివిధ క్యాడర్లలో పనిచేస్తున్న (38) మంది మావోయిస్టు సభ్యులు, ముగ్గురు మహిళా సభ్యులతో పటు అనగా Party Members-02, Militia Members-16,VCMs-07, KAMS Members-06, CNM-03, GRD5-04 ఈ రోజు ఎస్పీ ముందు లొంగిపోయారు
Admin
తెలుగు వెలుగు టీవీ