తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం ప్రాజెక్టు అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ (AITUC) మహాసభ కొత్తగూడెంలో ఘనంగా నిర్వహించబడింది. ఈ మహాసభలో AITUC రాష్ట్ర డిప్యూటీ ప్రధాన కార్యదర్శి సీహెచ్. సీతా మహాలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఎస్‌ఐఆర్ (SIR) పేరుతో అంగన్వాడీ టీచర్లకు బీఎల్‌ఓ విధులు అప్పగించడం వల్ల అంగన్వాడీ కేంద్రాలు మూతపడే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. అంగన్వాడీ కేంద్రాలు మూతపడటంతో గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు అందాల్సిన పోషకాహారం, సేవలు నిలిచిపోతున్నాయని తెలిపారు. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లపై అదనపు పనిభారం మోపకుండా బీఎల్‌ఓ విధులను వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు రూ.18,000 కనీస వేతనం వెంటనే అమలు చేయాలని కోరారు. సమావేశంలో AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి నరాటి ప్రసాద్, జిల్లా అధ్యక్షులు గోనే మణి మాట్లాడుతూ అంగన్వాడీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ మహాసభలో జిల్లా నాయకులు నేరళ్ల రమేష్, జక్కుల రాములు, కృష్ణవేణి, కమల, సరోజ, జానకి, కృపమ్మ, వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు. విడుదల చేసినవారు: నరాటి ప్రసాద్, AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.
Admin
తెలుగు వెలుగు టీవీ