తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం ప్రకృతి ఆశ్రమం ఆధ్వర్యంలో, ఈ నెల 23వ తేదీన జరుగనున్న ప్రకృతి ఆరోగ్య మహాసభలకు హాజరు కావాలని కోరుతూ.. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కు ప్రకృతి ప్రేమికులు మొక్కను అందించి ఆహ్వానం పలికారు. జిల్లాలోనే ప్రకృతి పర్యావరణం పై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్న కలెక్టర్ ని సభలకు వచ్చి సందేశం ఇవ్వాలని సభ్యుల విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆశ్రమ సభ్యులను అభినందించారు. సభలో పాల్గొంటానని తెలియజేశారు జిల్లా కలెక్టర్ కు ఆహ్వానం పలికిన వారిలో కొత్తగూడెం మున్సిపల్ గ్రీన్ అంబాసిడర్ మొక్కల వెంకటయ్య, సభల కో -ఆర్డినేటర్ జి సుగుణ రావు, మొక్కల రాజశేఖర్, బంగారి శంకర్, దయానంద సాగర్, రాజేష్ లు ఉన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ