తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కోతులు కుక్కల సమస్యలు పరిష్కరించడంలో విఫలమవుతున్న అధికారులు కోతులు, కుక్కల భారీ నుండి ప్రజలను కాపాడాలని ఈ సమస్యలను పరిష్కరించడంలో కార్పొరేషన్ అధికారులు విప్లమవుతున్నారని సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు మునిగడప వెంకటేశ్వర్లు, గిరిజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు భూక్య శ్రీనివాస్ లు విమర్శించారు. మంగళవారం స్థానిక వనం దాస్ గడ్డలో కోతులు కుక్కల సమస్యలపై ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో వారు మాట్లాడుతూ రామవరం ప్రాంతంలో కోతులు, కుక్కలు మనుషులపై దాడి చేసి గాయాలపాలు చేస్తున్నాయని, ప్రజలు భయాందోళన చెబుతున్నారని వారు ఆవేదన చెందారు. కోతులు ఇండ్లలో జొరబడి ఇంట్లోని వస్తువులను కిరాణా సరుకులను చిందరవందర చేస్తూ, ఇంటిపైకి ఎక్కి రేకులు పడగొడుతున్నాయని అన్నారు. గత 4 రోజుల క్రితం ఒక మున్సిపల్ ఉద్యోగిపై కోతులు దాడి చేసి నా మున్సిపల్ అధికారులకు చలనం లేదని తక్షణమే మున్సిపల్ అధికారులు స్పందించి కొత్తగూడెం మున్సిపాలిటీలో ఉన్న కోతులు, కుక్కల నివారణ కోసం చర్యలు తీసుకొని ప్రజలను కాపాడాలని వారు అధికారులకు విజ్ఞప్తి చేశారు. కోతులు కుక్కల సమస్యలపై మున్సిపాలిటీపై దశల వారి ఆందోళనకు సమావేశం తీర్మానం చేశారు .ఈ సమావేశంలో ఉన్నదాసు గడ్డ శాఖ వన్ సహాయ కార్యదర్శి తోగరు నరేంద్ర కుమార్, శాఖ టు కార్యదర్శి ఎస్కే జలీల్, సీనియర్ నాయకులు ఆది మల్లయ్య, సూరి మేని రామారావు ,కడారి మల్లేష్, శంకర్, నాగోల్ మీరా, అలిమ్, రమేష్, వెంకన్న,కృషీద్, పాష తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ