తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పాల్వంచ ఇందిరానగర్ కాలనీ వద్ద ద్విచక్ర వాహనాన్ని, లారీ ఢీకొట్టడంతో శుక్రవారం ఒకరు మృతి చెందారు. మృతుడు పెద్దమ్మ గుడిలో రికార్డ్ అసిస్టెంట్ గా విధులు నిర్వహించే కుంచాల సూర్యనారాయణ (48) కేశవా పురం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ