తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మణుగూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల అభివృద్ధి కోసం బిటీపీఎస్ సీఈ ఆధ్వర్యంలోబుధవారం ఐ డి ఓ సి కార్యాలయం కలెక్టర్ ఛాంబర్ నందు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) నిధుల కింద రూ.1.45 లక్షల చెక్కును జిల్లా కలెక్టర్ అంకిత్ కు అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, ప్రభుత్వ విద్యాసంస్థల బలోపేతానికి కార్పొరేట్ సంస్థలు ముందుకు రావడం అభినందనీయమని తెలిపారు. విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు ఇలాంటి సిఎస్ఆర్ నిధులు ఉపయుక్తంగా ఉంటాయని తెలిపారు . సమాజాభివృద్ధిలో భాగంగా మరిన్ని సంస్థలు కూడా విద్యా రంగ అభివృద్ధికి సహకరించాలని ఆయన సూచించారు.బిటీపీఎస్ సీఈ బిచ్చన్న మాట్లాడుతూ, మణుగూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో అవసరమైన అభివృద్ధి పనుల కోసం ఈ నిధులు వినియోగించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో సి పి ఓ సంజీవరావు సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ