తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం ఏప్రిల్ 22 (తెలుగు వెలుగు) : ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు వెలువడిన సందర్భంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిఐఈఓ హెచ్ వెంకటేశ్వరరావు గౌరవ కలెక్టర్ ని కలిసి ఫలితాలు వివరించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థిని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఫెయిల్ అయిన వారు నిరాశ పడకూడదని ఇలాంటి ఫెయిల్యూర్స్ ఏ జీవితంలో ఎన్నో గుణపాటాలు నేర్పుతుందని దానివల్ల ఎన్నో శిఖరాలను అధిరోహించవచ్చని తెలియజేశారు. త్వరలో జరగబోవు అడ్వాన్స్ సప్లమెంటరీ ఎగ్జామినేషన్లో పాల్గొని ఉత్తీర్ణులు అవ్వాలని తెలియజేశారు
Admin
తెలుగు వెలుగు టీవీ