Sunday, 19 April 2026 02:00:14 PM
# గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్.

మహాసభలను జయప్రదం చేయండి -టీజీవో అధ్యక్షులు వెంకట పుల్లయ్య

Date : 21 March 2025 04:27 PM Views : 551

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రకృతి ఆశ్రమం ఆధ్వర్యంలో ఈనెల 23న కొత్తగూడెం క్లబ్ లో జరుగనున్న ప్రకృతి - ఆరోగ్య మహాసభలను విజయవంతం చేయాలని, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు, సంగం వెంకట పుల్లయ్య విజ్ఞప్తి చేశారు. శుక్రవారం బస్టాండ్ సమీపంలో గల ప్రకృతి ఆశ్రమం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆశ్రమం ముఖ్య సలహాదారు వెంకట పుల్లయ్య పాల్గొని మాట్లాడారు. శారీరక, మానసిక ఆరోగ్యాలతో పాటు, పర్యావరణ ప్రకృతి పరిరక్షణలపై వక్తలు పాల్గొని ప్రసంగిస్తారన్నారు. ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ IAS, జిల్లా ఎస్పీ బి రోహిత్ రాజు ఐపీఎస్, శ్రీమతి జి.కవిత నాయుడు సింగరేణి జనరల్ మేనేజర్ (పర్సనల్), ఎల్ భాస్కర్ నాయక్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, అబ్దుల్ రహమాన్ కొత్తగూడెం డిఎస్పి, మున్సిపల్ కమిషనర్ సుజాత లు పాల్గొని తమ సందేశాలు ఇస్తారని వెల్లడించారు. ఆరోగ్య పరిరక్షణ, మానసిక ఒత్తిడిని జయించడం ఎలా, జల సంరక్షణ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులు, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం, ఆనందమయ జీవితం మొదలైన అంశాల పైన, ముఖ్య వక్తలుగా ప్రముఖ ప్రకృతి కవి, కాళోజీ అవార్డు గ్రహీత, కొత్తగూడెం ఆశ్రమం వ్యవస్థాపక అధ్యక్షులు జయరాజు, ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు, సైకాలజిస్ట్, రెండు తెలుగు రాష్ట్రాల 'స్టెప్' సమన్వయకర్త, డా. ప్రత్యూష సుబ్బారావు., ప్రముఖ సీనియర్ సర్జన్, జాతీయ బాలోత్సవ్ కన్వీనర్ డా.వి. రమేష్ బాబు, సీనియర్ ఆకుపంచర్ తెరపిస్ట్ డా. అనిల్ కుమార్ తెంబరేని., జాతీయ జల సాధన సమితి అధ్యక్షులు, ఫ్లోరోసి స్ నివారణ ఉద్యమ నేత, సహజ అడవి సృష్టికర్త దుశర్ల సత్యనారాయణ, ప్రముఖ ప్రకృతి వ్యవసాయకులు, వరల్డ్ మిలీనీర్ రైతు అవార్డు గ్రహీత లోకసాని పద్మా రెడ్డి, సింగరేణి రిటైర్డ్ జిఎం శనగ వెంకటేశ్వరరావు, లు పాల్గొని ప్రసంగిస్తారన్నారు. అన్ని రకాల ఆరోగ్యాల పైన, సమగ్ర మైనటువంటి అవగాహన పెంచుకునేందుకు, ప్రధానంగా మానసిక ఒత్తిడీలను జయించేందుకు, నాలెడ్జ్ సమూపార్జనకు ఈ సభలలో పాల్గొనాలని వెంకట పుల్లయ్య విజ్ఞప్తి చేశారు. కొత్తగూడెం క్లబ్లో ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు జరుగుతాయన్నారు. భోజన వసతులు కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మహాసభ పర్యంతం ఆరోగ్య కార్యకర్తల, గాయకుల, గేయాలు పాటలు ఉంటాయని తెలిపారు. ఈ సమావేశంలో ఆశ్రమ సలహాదారు జినుగు బాలశౌరి, కోఆర్డినేటర్ జి. సుగుణ రావు, కొత్తగూడెం మున్సిపల్ గ్రీన్ అంబాసిడర్ మొక్కల వెంకటయ్య, తుంపురు శివ,సబ్బన రాజేష్, కొత్తపల్లి రమేష్ బాబు, శంకర్ బంగారి, దయానంద సాగర్, కృష్ణకుమారి లు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :