తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం ఏరియా లోని జనరల్ మేనేజర్ కార్యాలయము నందు మట్టి వినాయక విగ్రహ ప్రతిమల పంపిణీ కార్యక్రమమును నిర్వహించడం జరిగినది. ఈ మట్టి వినాయక విగ్రహ ప్రతిమల పంపిణీ కార్యక్రమమునకు ముఖ్య అతిదిగా కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం. షాలేం రాజు హాజరుకావడమైనది. ఈ సందర్భంగా కొత్తగూడెం ఏరియా జిఎం మాట్లాడుతూ ముందుగా ఉద్యోగులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ పర్యావరణము పరిరక్షించుకోవడం మన అందరి ప్రాధమిక బాధ్యత అని అందులో భాగంగా ఈ మట్టి ప్రతిమలను ఉద్యోగులకు అందజేయడం జరుగుతుందని కావున ఉద్యోగులందరూ ఈ విషయాన్ని గమనించి మట్టి వినాయక విగ్రహ ప్రతిమలకు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించుకొని వినాయక చవితి పండుగను జరుపుకోవాలని తెలియజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం జిఎంతో పాటు ఏఐటియూసి యూనియన్ సెంట్రల్ కౌన్సెల్లింగ్ మెంబర్ షైక్. హుమాయూన్, ఐఎన్‌టియూసి యూనియన్ వైస్ ప్రెసిడెంట్ ఎండి.రజాక్, ఎస్ ఓ టు జి ఎం జి.వి.కోటిరెడ్డి, ఏరియా ఇంజెనీర్ కే. సూర్యనారాయణ రాజు, ఏజీఎం (ఫైనాన్స్) కే.సుమలత, ఏజీఎం (సివిల్) సిహెచ్.రామకృష్ణ, డిజిఎం (పర్సనల్) జి.వి. మోహన్ రావు, డిజిఎం (ఐఈ ) ఎన్.యోహన్, ఇతర విబాగల అధిపతులు, అధికారులు జిఎం కార్యాలయంలో పనిచేయు ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు ఇతర సభ్యులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ