తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేకంగా వారోత్సవాలు భాగంగా ఈనెల20 నుండి 26 వరకు మిషన్ పరివర్తన , నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అడిషనల్ కలెక్టర్ రెవిన్యూ వేణుగోపాల్ మరియు లోకల్ బాడీస్ విద్యాచందన ముఖ్య అతిథులుగా హాజరై ఈ కార్యక్రమం గురించి తెలిపారు . ఐడిఓసి కార్యాలయం నందు జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనిన అధ్యక్ష తన జిల్లా అధికారులు మరియు లైన్ డిపార్ట్మెంట్స్ పాల్గొనడం జరిగింది . మాదకద్రవ్యాలకు బానిస కావొద్దు మాదకద్రవ్యాలు ఆరోగ్యాన్ని మాత్రమే పాడు చేయవు అవి మీ సామర్థ్యాన్ని నశింపజేస్తాయి .మాదకద్రవ్యాల పై విద్యార్థులకు మరియు యువకులకు జిల్లా నందు అవగాహన కార్యక్రమాలు చేపట్టి పాఠశాలల్లో , కళాశాలలో మాదకద్రవ్యాలపై వాటి వినియోగం ప్రభావం దుష్ఫలితాలు విరివిగా ప్రచారం చేయాలని యువత మాదకద్రవ్యాలకు లోను కాకుండా చూసే బాధ్యత ప్రతి వారిపై ఉన్నదని తెలిపారు . మాదకద్రవ్యాలకు బానిసలైన వారికి జిల్లా నందు డ్రగ్ డి అడిక్షన్ సెంటర్ దక్షిత ఫౌండేషన్ వారి ద్వారా భద్రాచలం లో ఏర్పాటు చేయబడిందని ఎవరైనా బాధితులు ఉన్నట్లయితే వారికి సూచనలు సలహాలు ,మందులు ఇచ్చి వారిని మత్తు నుండి దూరం చేయడానికి ప్రయత్నిస్తారు . జిల్లా నందు హాట్ స్పాట్ సెంటర్లను గుర్తించి అక్కడి నుండి మత్తు పదార్థాలు ఇతర ప్రాంతాలకు రవాణా కాకుండా చూసే బాధ్యత పోలీసులకు, ఎక్సైజ్ వారికి కాకుండా అరికట్టాల్సిన బాధ్యత పౌరులుగా ప్రతి ఒక్కరి పై ఉందని ఈ సందర్భంగా తెలియ జేశారు. బానిసలైన వారి వివరాలను టోల్ ఫ్రీ నెంబర్ 14446 కి సమాచారాన్ని అందిస్తే సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుందని డ్రగ్ రహిత సమాజాన్ని నిర్మించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు . “మాదకద్రవ్యాల దుర్వినియోగం - ఆరోగ్యంపై ప్రభావాలు “పోస్టర్లను ఈ సందర్భంగా విడుదల చేశారు. ప్రతి పాఠశాల , కళాశాల నందు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని డ్రగ్ ఫ్రీ జిల్లాగా తయారు చేయడంలో ప్రతి ఒక్కరూ కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనిన , రెవిన్యూ డివిజన్ అధికారులు మధు , దామోదర్ , జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి భాస్కర్ నాయక్ , జిల్లా విద్యా శాఖాధికారి వెంకటేశ్వర చారి , జిల్లా ఇంటర్మీడియట్ విద్యా శాఖాధికారి వెంకటేశ్వర్లు ,ఎస్సీ వెల్ఫేర్ అనసూయ , బీసీ వెల్ఫేర్ ఇందిరా మైనార్టీ వెల్ఫేర్ సంజీవరావు , ఎక్స్చేంజ్ పోలీస్ సిఐ కరంచంద్ , వరప్రసాద్ ,నరేష్ పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ