తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లా వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న సాదా బైనమా,భూభారతి దరఖాస్తులు, ఎస్‌ఐఆర్ మ్యాపింగ్ మరియు ఇతర భూ సమస్యలపై జిల్లా కలెక్టర్ శనివారం తాసిల్దారులు, సంబంధిత శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం సడలించిన నిబంధనల ఆధారంగా పెండింగ్‌లో ఉన్న సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సంబంధిత దరఖాస్తులపై వెంటనే నోటీసులు జారీ చేసి, వేగవంతమైన చర్యలు చేపట్టి సమస్యలను పరిష్కరించాలని తాసిల్దారులను ఆదేశించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మండలాల వారీగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల వివరాలను తాసిల్దారులను అడిగి తెలుసుకున్నారు. నిర్దేశిత గడువులోగా అన్ని భూభారతి దరఖాస్తులను పరిష్కరించాలని స్పష్టం చేశారు.ఎస్‌ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని, డిలీషన్ ప్రక్రియను కచ్చితంగా నిబంధనలకు అనుగుణంగా మాత్రమే చేపట్టాలని సూచించారు. మరణించిన వ్యక్తుల పేర్ల తొలగింపు విషయంలో నోటీసులు జారీ చేసి, సరైన ధ్రువీకరణ అనంతరం మాత్రమే చర్యలు తీసుకోవాలని అన్నారు . ఈ ప్రక్రియలో బిఎల్వోలు క్షేత్రస్థాయిలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని ఆదేశించారు.జిల్లాలో ఉన్న పాల్వంచ, దమ్మపేట, కరకగూడెం తదితర మండలాల్లో ఉన్న అటవీ, రెవెన్యూ మరియు ఇతర భూ సమస్యలకు సంబంధించిన సమగ్ర నివేదికలను వెంటనే సిద్ధం చేసి రేపటిలోగా సమర్పించాలని తాసిల్దారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ