Tuesday, 26 May 2026 11:23:36 PM
# సిపిఐ జిల్లా కార్యాలయంలో ఘనంగా గిరిప్రసాద్ 29వ వర్ధంతి. # జర్నలిస్టుల హక్కుల రక్షణకు, సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # రేషన్ డీలర్ల జిల్లా స్థాయి సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # ఎండ తీవ్రత ప్రాంతాల్లో రోడ్లపై నీళ్లు చల్లాలి. సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి ఎండ తీవ్రత కారణం. 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ డిమాండ్. # దళితుల అభ్యున్నతికి విశేష కృషి చేసిన మహనీయుడు భాగ్యరెడ్డి వర్మ : జిల్లా కలెక్టర్ అంకిత్. # జనగణన హౌస్ లిస్టింగ్‌లో ఖచ్చితత్వానికి ప్రాధాన్యం ఇవ్వాలి - డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ భారతి హోలీకేర్. # కాంట్రాక్ట్ కార్మికులకు పెండింగ్ సర్క్యులర్స్ ను విడుదల చేయాలి. ఏఐటీయూసీ కొత్తగూడెం రీజియన్ కార్యదర్శి యర్రగాని కృష్ణయ్య. # ఉద్యోగులు సమయపాలన పాటించాలి. ఐడీఓసీ కార్యాలయంలోని వివిధ శాఖలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్. # చండ్రుగొండ మండల కేంద్రం బస్ స్టేషన్ లో ని మరమ్మతు ల పనులను పరిశీలించిన అశ్వరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు జారే ఆదినారాయణ # 23వ డివిజన్లో ముఖ్య కార్యకర్తల సమావేశం. టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు పిలుపు. # ప్రజా ఆరోగ్యం పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # ఓటర్ల జాబితా సమగ్ర సవరణకు పార్టీ శ్రేణులు సహకరించాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # ఉపాధి హామీ నిధులతో చేపట్టిన పనులను వేగవంతం చేయాలి. ఉపాధి హామీ కూలీల సంఖ్యను పెంచాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # రైతులకు ఇబ్బందులు లేకుండా మొక్కజొన్న కొనుగోళ్లు చేపడుతున్నాం - జిల్లా కలెక్టర్ అంకిత్. # కాంగ్రెస్ పార్టీ 21 వ డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశం. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగా సీతారాములు పిలుపు. # జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు గల పోలీస్ ఫైరింగ్ రేంజ్ నందు జిల్లాలోని పోలీసు అధికారులు,సిబ్బందికి యాన్యువల్ ఫైరింగ్ ప్రాక్టీస్. # ప్రాణాపాయ స్థితిలో 8 ఏళ్ల బాలుడు. దాతల సహాయం కోసం తల్లిదండ్రుల వేడుకోలు. # చండ్రుగొండ మండలం, దామెరచర్లలో ఆగ్రహించిన అన్నదాత. # ఫిట్ అండ్ యాక్టివ్ తెలంగాణ 2K రన్‌లో ఉత్సాహంగా పాల్గొన్న ఎమ్మెల్యే జారె.

గిరిజన ప్రాంతాల అభివృద్ధి, రవాణా సౌకర్యానికి పెద్దపీఠ : కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు

Date : 23 May 2026 06:24 PM Views : 24

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రవాణా కష్టాల శాశ్వత పరిష్కారానికే సరికొత్త హై లెవల్ బ్రిడ్జిల నిర్మాణాలు మౌలిక వసతుల కల్పనతో పల్లెల రూపురేఖలు మార్చడమే ప్రధాన ధ్యేయం గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికే పిహెచ్సి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా నిరంతర శ్రమ, మరిన్ని నిధుల సాధన సమస్యల పరిష్కారంలో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరం ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి త్వరితగతిన పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తాం : కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ఐటిడిఏ నిధుల ద్వారా పెద్దపీట వేస్తున్నామని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. శనివారం నియోజకవర్గ పరిధిలోని పలు అభివృద్ధి పనులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇందులో భాగంగా చిట్టిరామవరం నుంచి చుంచుపల్లి రహదారిపై హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి, అలాగే కొత్తగూడెం బైపాస్ రోడ్డు నుంచి పెనుబల్లి (గరిమెళ్ళపాడు) ప్రధాన రోడ్డుపై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అదేవిధంగా పెనుబల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన పిహెచ్సి భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో ఆయన మాట్లాడుతూ మౌలిక వసతుల కల్పనతో పల్లెల రూపురేఖలు మార్చడమే తమ ప్రధాన ధ్యేయమన్నారు. ఈ బ్రిడ్జిల నిర్మాణంతో స్థానిక ప్రజల దశాబ్దాల రవాణా కష్టాలు తీరనున్నాయని, అత్యవసర సమయాల్లో వైద్యం కోసం ఇబ్బందులు పడకుండా పెనుబల్లిలో అధునాతన ప్రాధమిక వైద్యశాల అందుబాటులోకి తెచ్చామని ఆయన వివరించారు. రానున్న రోజుల్లో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతామని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్, గ్రంధాలయ చైర్మన్ వీరబాబు, అధికారులు ఎంపిడివో శుభాషిణి, తహసీల్దార్ నాగరాజు, ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు మధుకర్, శ్రీకాంత్, నాగేంద్ర, స్థానిక నాయకులు వాసిరెడ్డి మురళి, నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు, భవాని, గోవిందు, సర్పంచి శాంతి శ్రీ, రెడ్డి అరుణ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :