తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : * భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ, ఆగస్టు 19 (తెలుగు వెలుగు) బహుజనులకు రాజ్యాధికారం దక్కే వరకు విశ్రమించొద్దని సింగరేణి రిటైర్డ్ జీఎం శనగ వెంకటేశ్వర్లు అన్నారు.సోమవారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన రాజకీయ శిక్షణ తరగతులకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ప్రతీ గ్రామానికి,ప్రతీ ఇంటికి బీఎస్పీని చేరువ చేసేందుకు ప్రతీ కార్యకర్త సైనికుడిలా పని చేయాలన్నారు.బూటకపు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేంద్రంలోని జాయింట్ సెక్రటరీ,డైరెక్టర్ మరియు డిప్యూటీ సెక్రటరీ వంటి 45 ఉన్నత పోస్టులపై డైరెక్టుగా లెటరల్ ఎంట్రీ ద్వారా రిక్రూట్ మెంట్ నిర్ణయం సరైంది కాదని తద్వారా డైరెక్ట్ రిక్రూట్ మెంట్ అయిన వారికి ప్రమోషన్ లో అన్యాయం జరుగుతుందని,దీనితో పాటు ఎస్సీ,ఎస్టీ మరియు బీసీ వర్గాలకు చెందిన వ్యక్తులకు ఈ ప్రభుత్వ నియామకాల్లో వారి కోటాను నిష్పత్తిలో నియామకం ఇవ్వకపోతే అది నేరుగా రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందన్నారు. మరియు ఈ ఉన్నత పదవులను ఎటువంటి నియమాలు లేకుండా ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేయడం బిజెపి ప్రభుత్వం యొక్క ఏకపక్షంగా ఉంటుందని ఇది చట్ట విరుద్ధం మరియు రాజ్యాంగ విరుద్ధం అవుతుందన్నారు.ఈకార్యక్రమంలో పాల్గొన్న బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ మాట్లాడుతూ ఈనెల 21వ తేదీన జరగబోవు భారత్ బంద్ లో ఎస్సీ,ఎస్టీ,బీసీ మరియు మతమైనార్టీలైన బహుజనులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గంధం మల్లికార్జునరావు,జిల్లా మహిళా కన్వీనర్ యెర్రంశెట్టి రాజేశ్వరి,కోళ్లపూడి ప్రవీణ్,వినయ్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ