తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలో డా. బాబూ జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలను జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్ సెంటర్, భద్రాద్రి కొత్తగూడెం క్లబ్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అంకిత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా కలెక్టర్ అంకిత్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి, డా. బాబూ జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు అర్పించి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, డా. బాబూ జగ్జీవన్ రామ్ దేశ రాజకీయాల్లో సుదీర్ఘకాలం విశిష్ట సేవలు అందించి, సామాజిక న్యాయ సాధనకు కృషి చేసిన మహానేత అని కొనియాడారు. ఆయన జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొంటూ, ఉన్నత స్థాయికి ఎదగాలంటే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వంలో అనేక శాఖలకు మంత్రిగా సేవలందించడమే కాకుండా దేశ ఉప ప్రధానిగా కూడా సమర్థవంతంగా పనిచేసి ప్రజాసేవకు అంకితభావంతో నిలిచారని తెలిపారు.మహనీయుల ఆశయాలను ఆచరణలో పెట్టి సమాజంలో వివక్ష లేకుండా సమానత్వంతో ముందుకు సాగాలని కలెక్టర్ ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రోహిత్ రాజు, అదనపు కలెక్టర్ వేణు గోపాల్, కొత్తగూడెం మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, సీపీఐ నాయకులు సాబీర్ పాషా, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి ఎం. శ్రీలత, జయంతి ఉత్సవ కమిటీ కన్వీనర్ దాసరి శ్రీనివాస్, కో-కన్వీనర్లు చదలవాడ సూరి, కూసపాటి శ్రీనివాస్, మంద హనుమంతు, మద్దెల సూరి తదితరులు, శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ