Friday, 19 June 2026 05:48:04 PM
# టాస్క్ఫోర్స్ మరియు అన్నపురెడ్డి పల్లి పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో భారీగా 44.30 లక్షలు విలువైన గంజాయి స్వాధీనం. # కిన్నెరసానిని ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # ప్రశాంత వాతావరణంలో టీజీ టెట్ పరీక్షలు. జిల్లా కలెక్టర్ అంకిత్ . # జూలూరుపాడు ప్రభుత్వ పాఠశాల నందు సామూహిక అక్షరాభ్యాసం # వైకుంఠ రధం రిపేర్ చేయించి ఉపయోగమునకు తీసుకురావాలి. మేనేజర్ కి వినతి పత్రం అందించిన సిపిఐ జిల్లా నాయకులు మునిగడప వెంకటేశ్వర్లు. # ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మరమ్మత్తు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # అర్హుల గుర్తింపులో పారదర్శకత పాటించాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఎంఈఓలదే – జిల్లా కలెక్టర్ అంకిత్. # రాష్ట్రంలో బిజెపి జెండా ఎగిరేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి - విలేకరుల సమావేశంలో ఉదయ్ ప్రతాప్, బైరెడ్డి. # పారిశుద్ధ్య కార్మికుడు శేషు అకాల మరణం అత్యంత బాధాకరం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్. # ముఖ్యమంత్రి పంపిన లేఖ, పుష్పగుచ్ఛం అందుకోవడం సంతోషకరం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # కొత్తగూడెంలో మణుగూరు సూపర్ ఫాస్ట్ రైలు కింద పడి వ్యక్తి మృతి. # వెంకటయ్య మృతి పార్టీకి తీరని లోటు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి - ఎస్బీఐ రీజినల్ మేనేజర్ పీజీఎన్ శర్మ. # ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజుల వసూళ్లను తక్షణమే నియంత్రించాలి. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్కే షాహిద్, వరక అజిత్. # అమృత్ పథకం నిధులతో వేగవంతంగా సాగుతున్న నీటి పథకాల నిర్మాణ పనులు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన పూర్వ విద్యార్థులు. # సాధారణ ప్రసవాలను పెంచాలి – మాతృ, శిశు మరణాలను తగ్గించాలి. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. తుకారాం రాథోడ్. # జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు పటిష్టంగా అమలు చేయాలి. Dr తుకారాం రాథోడ్ DMHO. # గుడిపాడు యూపీహెచ్‌సీని సందర్శించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. తుకారాం రాథోడ్.

ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ప్రతి దరఖాస్తు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి , అదనపు కలెక్టర్ వేణుగోపాల్ , హౌసింగ్ పీడీ రవీందర్

Date : 04 August 2025 03:41 PM Views : 894

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ప్రతి దరఖాస్తు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ వేణుగోపాల్ , హౌసింగ్ పీడీ రవీందర్ నాథ్ అధికారులను ఆదేశించారు.సోమవారం ఐడిఓసి కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యల నుండి దరఖాస్తులు స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు...... * ప్రజావాణి లో వచ్చిన ఫిర్యాదులు కొన్ని.* రామవరం ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని చిట్టి రామవరం తండా, 19వ డివిజన్లో నివసిస్తున్న గిరిజన లంబాడి పోడు రైతులు కొంతమంది సర్వే నెంబర్ 20 లో గల ఆర్వో ఎఫ్ ఆర్ అటవీ శాఖ పోడు భూములను గత 40 సంవత్సరాలుగా మా పూర్వీకుల నుండి పోడు నరికి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, గతంలో మొత్తం 340 మంది పోడు రైతులు పట్టాల కొరకు దరఖాస్తు చేయగా, అందులో 97 మంది రైతులకు మాత్రమే పట్టాలు మంజూరు అయ్యాయని, కావున మిగిలిన వారికి పట్టాలు మంజూరు చేయాలని చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యలు నిమిత్తం భద్రాచలం ఐటీడీఏ పీవో కు ఎండార్స్ చేశారు.చంద్రుగొండ మండలం వెంకట్య తండా పంచాయతీ పరిధిలోని కరశలబోడు తండా లో నివసిస్తున్న పోడు వ్యవసాయం చేస్తున్న రైతు ధారావత్ లక్ష్మి w/o బాలు తాము ప్రభుత్వ అనుమతితో బోరు వేసుకున్నామని, అట్టి బోరుకు విద్యుత్ కనెక్షన్ కొరకు 200 మీటర్లు ఉన్న ట్రాన్స్ఫారం నుండి తీసుకున్నటకు అనుమతించాలని కోరుతూ చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యలు నిమిత్తం విద్యుత్ శాఖ అధికారులకు ఎండార్స్ చేశారు. పాల్వంచ మండలం జయమ్మ కాలనీలో నివాసం ఉంటున్న పెనుగొండ రాజేశ్వరి w/o వీర కుమార్ భార్యాభర్తలు వివిధ కారణాల చేత విడిపోవడం జరిగిందని, రామానుజవరం గ్రామంలో సర్వేనెంబర్ 853 లో సుమారు 0.20 కుంటల భూమిని తనకు రాసి ఇవ్వడం జరిగిందని అట్టి భూమి మణుగూరు సింగరేణి కాలరీస్ ఓపెన్ కాస్ట్ విస్తరణలో భాగంగా భూసేకరణకు గురి అవుతున్నందువలన, తనకు రాసిచ్చిన భూమి నష్టపరిహారం తనకు ఇప్పించవలసిందిగా చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యలు నిమిత్తం ఈ సెక్షన్ సూపర్డెంట్ కు ఎండార్స్ చేశారు. ఇల్లందు రెండవ నెంబర్ బస్తి లో నివాసం ఉంటున్న సిలువేరు చంద్రావతి తాను ఒంటరి మహిళలను అని తనకు వితంతు పింఛన్ మంజూరు చేయవలసిందిగా చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యలు నిమిత్తం డి ఆర్ డి ఓ కు పంపనైనది. చర్ల మండలం, చర్ల గ్రామంలో నివాసం ఉంటున్న భోగాల శివ తన తాతగారైన కొందమల్ల నరసింహారావు వాజేడు తాసిల్దార్ కార్యాలయంలో వీఆర్ఏ గా విధులు నిర్వహిస్తూ చనిపోయారని, తన తాతగారి ఉద్యోగం తమ కుటుంబానికి ఏ విధమైన సంబంధం లేనటువంటి వ్యక్తి తప్పుడు దృవపత్రాలు సృష్టించి జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నారని, కావున పూర్తి విచారణ జరిపి న్యాయం చేకూర్చాలని చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యలు నిమిత్తం కలెక్టరేట్ పరిపాలన అధికారికి ఎండార్స్ చేశారు.ఈ ప్రజావాణి కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: