Monday, 20 April 2026 01:33:59 PM
# అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ MLA,BRS పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు నేడు అశ్వారావుపేట మండలంలో విస్తృతంగా పర్యటించారు. # వైద్య ఖర్చులకు లక్ష రూపాయల ఎల్ఓసి మంజూరు చేసిన ఎమ్మెల్యే జారె. # మహా కుంభాభిషేకానికి రావాల్సిందిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆహ్వానించిన ఎమ్మెల్యే జారె. # గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ.

వైద్య విద్యార్థుల అభివృద్ధికి అవసరమైన సదుపాయాలు కల్పించాలి – జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 23 October 2025 06:26 PM Views : 243

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : వైద్య విద్యార్థుల అభివృద్ధికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాలి అని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ కొత్తగూడెం ప్రభుత్వ వైద్య కళాశాలను సందర్శించి, కళాశాల అన్ని విభాగాలు, వసతులు, నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. ఈ పరిశీలనలో భాగంగా కలెక్టర్ కలెక్టర్ కొత్తగా నిర్మాణంలో ఉన్న హాస్టల్ వసతి భవనాన్ని పరిశీలించి, నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేయాలని ఆర్ఎంబీ అధికారులను ఆదేశించారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా కళాశాల చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణానికి తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వైద్య కళాశాల అభివృద్ధి అంటే విద్యార్థుల సమగ్ర అభివృద్ధి అని,వారికి సౌకర్యవంతమైన వసతి, పరిశుభ్రమైన ఆవరణ, ఉత్తమ విద్యా వాతావరణం, ఆధునిక పరికరాలు అందుబాటులో ఉండాలి అన్నారు. వైద్య విద్యార్థుల భవిష్యత్తు దేశ ఆరోగ్య రక్షణకు పునాది అవుతుంది కాబట్టి కళాశాల అభివృద్ధిని ప్రాధాన్యంగా తీసుకోవాలి అని ఆయన అన్నారు.కళాశాల ఆవరణలో పచ్చదనం ఉట్టిపడేలా మొక్కలను నాటలని, విద్యార్థులలో పర్యావరణ స్ఫూర్తి పెంపొందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. వివిధ ప్రాంతాల నుండి విద్యార్థులు సులభంగా కళాశాలకు చేరుకునేలా బస్సు ఏర్పాటుకు ఆర్టీసీ అధికారులతో సమన్వయం చేసి బస్సు సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.వైద్య విద్యార్థులకు మెరుగైన బోధన వాతావరణం కల్పించేందుకు ల్యాబ్‌లు, లెక్చరర్ గ్యాలరీ, క్లాస్‌రూములు, లైబ్రరీ వంటి కళాశాల విద్యార్థులకు మెరుగైన బోధన, శిక్షణ అందించేందుకు అవసరమైన మౌలిక వసతులపై పూర్తి నివేదికను సమర్పించాలనీ, దానిపై ప్రాధాన్య క్రమంలో చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల సిబ్బంది లెక్చరర్ గ్యాలరీ ఏర్పాటుకు విజ్ఞప్తి చేయగా, దానిని త్వరలోనే అమలు చేసేలా చర్యలు చేపడతామని కలెక్టర్ హామీ ఇచ్చారు.పర్యటనలో వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపల్ రాజ్ కుమార్, డాక్టర్ సురేష్ బాబు వార్డెన్, కోటేశ్వరరావు ఏడిఈ, అధ్యాపకులు, సిబ్బంది మరియు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :