Sunday, 19 April 2026 02:17:02 PM
# గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్.

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్.

Date : 24 July 2025 06:04 PM Views : 747

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి అని, అవసరమైన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించండి అని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరదలు సంభవించే ప్రాంతాలను గుర్తించి, అక్కడ నివసిస్తున్న ప్రజలను ముందస్తుగా అప్రమత్తం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. భారీ వరద ప్రవాహ సమయంలో నదులు, కాలువలు, చెరువులు వంటి జలవనరుల వద్దకి వెళ్లకూడదని, వాటిని దాటేందుకు ప్రయత్నించరాదని స్పష్టం చేశారు. అలాగే రహదారులు, కల్వర్టులపై నీరు ప్రవహిస్తున్న చోట్ల అధిక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తాగునీరు కలుషితమయ్యే అవకాశాన్ని నివారించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం కాపాడుతూ, వ్యాధులు వ్యాపించకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులకు అవసరమైన సూచనలు అందించేందుకు వ్యవసాయ శాఖ అధికారులు సిద్ధంగా ఉండాలని తెలిపారు. తాగునీటి సరఫరాలో అంతరాయం రాకుండా గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విద్యుత్‌ సరఫరా నిలిచిన సందర్భంలో ఆసుపత్రుల్లో అత్యవసర సేవలకు ఆటంకం కలగకుండా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ప్రసవం సమీపించిన గర్భిణీలను ముందుగానే ఆసుపత్రులు లేదా గర్భిణీల వసతి కేంద్రాలకు తరలించాలని సూచించారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :