తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రామవరం లోని 5 మసీదులు జామా మజీద్, మదీనా మజీద్, జంజం మజీద్, మజీద్ ఏ రహీం ఖురేషి, మజిదే ఆలీ, కలిసి ఖబర్స్తాన్ మరియు ఈద్గా 25మందితో కమిటీని ఎంచుకోవడం జరిగింది. ఈ యొక్క కమిటీ అధ్యక్షులుగా ఎస్ కె, ఫహీమ్ దాదా ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అనంతరం ఫహీమ్ మాట్లాడుతూ భవిష్యత్తులో ఖబర్స్తాన్ మరియు ఈద్గాను మరింత అభివృద్ధి చేసే విధంగా ఈ కమిటీ పని చేస్తుందని, సాయంత్రం వేళల్లో మృతదేహాన్ని కబరిస్తాన్ తీసుకెళ్లినప్పుడు ఒక్క లైటు లేక రామవరం ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఎమ్మెల్యే గారితో మరియు అధికారులతో మాట్లాడి ఇటువంటి సమస్యలు ఎన్ని ఉన్నా పరిష్కరిస్తామని ఖబర్స్తాన్ మరియు ఈద్గా రోడ్లు స్ట్రీట్ లైట్లు, పోల్స్, ఇంకా సమస్యలు ఏదైతే ఉన్నాయో కమిటీ సభ్యులతో కలిసి సమస్యలు పరిష్కరిస్తామని ఆయన అన్నారు. ఈ యొక్క కమిటీ జనరల్ సెక్రెటరీగా రసూల్ పాషా, వర్కింగ్ ప్రెసిడెంట్ శమియుద్దిన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉస్మాన్, ట్రెజరర్ జావిద్, మరో 20 మందితో ఈ కమిటీ ఎన్నుకోబడింది. ఈ కార్యక్రమంలో ఖాసీం కురేసి, అజ్మత్ పాషా, ఉస్మాన్, జాకీర్, సత్తార్, అంకుష్, మక్బూల్ బాషా, ఖయ్యుమ్, హనీఫ్, జలీల్, అజీజ్, జానీ, పాషా, మైను, రసూల్, షౌకత్, గౌస్, మౌలానా, మసూద్, మునవర్, కమార్, అక్బర్, సలీం, అస్లాం, తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ