తెలుగు వెలుగు టీవీ - వార్తలు / ఖమ్మం : మధిరలో ఈనెల 3న రాష్ట్ర మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి వాకిటి శ్రీహరి పర్యటించనున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రులు ముందుగా వంగవీడులో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారని చెప్పారు. అనంతరం మధిర, బోనకల్ మండలాలకు చెందిన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేస్తారని పేర్కొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ