Wednesday, 15 April 2026 05:19:53 PM
# ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్. # ఐదు గ్రామపంచాయతీల కోసం సమరభేరి - సోమవారం భద్రాచలంలో భారీ సభ - హాజరుకానున్న రేణుకా చౌదరి. # అంగన్వాడి కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. # 'ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా జిల్లా డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో అలవాటుగా మారే మందుల దుర్వినియోగంపై సమగ్ర అవగాహన సదస్సు . # అణగారిన వర్గాలకు అక్షరజ్యోతి ఫూలే. జ్యోతిరావు ఫూలే జీవితం ఎందరికో ఆదర్శం. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి : జిల్లా వైద్యశాఖ అధికారి డా. తుకారాం రాథోడ్. # సాదా బైనమా దరఖాస్తుల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ . # చెవి పూర్తిగా వేరైన రోగికి విజయవంతమైన శస్త్రచికిత్స – కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నైపుణ్యం # స్త్రీ శిశు సంక్షేమ పథకాల అమలులో అంగన్వాడీ సిబ్బంది ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఎమ్మెల్యే జారె. # రాష్ట్ర అవార్డులకు జిల్లా కలెక్టర్ సహకారమే మూలం ఆసుపత్రుల్లో ఎన్నో సవాళ్లకు పరిష్కారం చూపిన కలెక్టర్. # ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 13 నుండి 18 వరకు “అరైవ్ అలైవ్” కార్యక్రమం నిర్వహణ – సీఎస్ రామకృష్ణ. # నిషేధిత గంజాయిని కలిగి ఉన్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్. # దిశాకమిటీ జిల్లాస్థాయి సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే జారె.

ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి - క్యాన్సర్ బారిన పడకండి : LT & Pharmacist సమీక్షా సమావేశంలో డాక్టర్ తుకారం రాథోడ్ DMHO

Date : 13 April 2026 05:39 PM Views : 99

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆరోగ్య శాఖ అధికారి Dr తుకారాం రాథోడ్ , LT ఫార్మసీ ఆఫీసర్, నెలవారి సమీక్ష సమావేశంలో భాగంగా ఆలోచన మీటింగ్ హాల్ నందు మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం మన జీవితంలో భాగమైపోయిందని దాని వలన అనేక అనర్ధాలు అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ముఖ్యంగా అనేకమంది క్యాన్సర్ బారిన పడుతున్నారని తెలియజేశారు, ఆరపదార్ధాలు త్రాగునీరు వంటి వాటికి ప్లాస్టిక్ వాడకాన్ని ఉపయోగించకూడదని, మన నిత్య జీవితంలో ప్లాస్టిక్ ని దూరం పెట్టాలని, బయట ఆహార పదార్థాలను తినకూడదని , నూనెలు రీసైక్లింగ్ చేసి వాడుతున్నందువలన క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని తెలియజేశారు, ప్రతిరోజు 5 లీటర్ల నీరు త్రాగాలని అలాగే శారీరక శ్రమ ఎక్సర్సైజులు , నడక మరియు యోగా చేయాలని తెలియజేశారు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గిరిజన జిల్లా ఏజెన్సీ జిల్లా అయినందువలన మన దగ్గరికి వచ్చే పేద రోగులకు అన్ని రకాల వైద్య సేవలు అందించాలని వారికి అవసరమైన మందులు ఇవ్వాలని , రక్తపరీక్షలు నిర్వహించాలని తెలియజేశారు ఉద్యోగులు అందరూ సమయపాలన పాటించాలని ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు డ్యూటీలో ఉండాలని విధులలో ఎటువంటి నిర్లక్ష్యాన్ని సహించనని తెలియజేశారు , క్యాన్సర్ నివారణకు వేసే HPV వ్యాక్సిన్ పై ప్రజలకు అవగాహన కల్పించాలని అర్హులైన యుక్త వయసు బాలికలకు అందరకు HPV వ్యాక్సిన్ వేయించేలాగా ప్రోత్సహించాలని తెలియజేశారు. భద్రాద్రి జిల్లా లో ఆరోగ్య సూచికలలో ముందు ఉంచాలని అందుకు మీరందరూ బాధ్యతగా పనిచేయాలని ఆరోగ్య సిబ్బంది ఆసుపత్రికి వచ్చే ప్రజలతో సత్ప్రవర్తనతో అభిమానంగా పలకరించాలని, ఎటువంటి నిర్లక్ష్యాన్ని సహించని, జిల్లాలో ఉన్న అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆరోగ్య ఉప కేంద్రాలు, బస్తీ దవాఖానలు , పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఆయుష్మాన్ ఆరోగ్య మందీర్ లలో ఆకస్మికతని తనికి చేస్తానని సిబ్బంది ఎవరు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించిన సమయపాలన పాటించకపోయినా శాఖ పరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు పాముకాటు , కుక్కకాటు మందులు ఎల్లవేళలా అందుబాటులో ఉంచుకోవాలని తెలియజేశారు. ఎండాకాలం దృశ్య వడ దెబ్బ తగలకుండా ప్రజలకు ఓఆర్ఎస్ పాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలని తెలియజేశారు. సికిల్ సెల్ , తల సేమియా, HIV, వ్యాధిల పై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలియజేశారు. TB అనుమానిత వ్యక్తుల నుండి స్పుటం శాంపిల్ సేకరించాలని , BP, సుగర్ మందులు అందుబాటులో ఉంచుకోవాలని తెలియజేశారు. IHIP పోర్టల్ లో ప్రగతి నివేదికలు ప్రతిరోజు ఆన్లైన్ చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో , Dr సాయి కల్యాణ్ Dy DMHO కొత్తగూడెం, Dr రాందాస్ PO మలేరియా గారు, సొమ్లా CHO , రాంప్రసాద్ HEO, కుమార స్వామి AMO ,ఎల్టీలు మరియు ఫార్మసీ ఆఫీసర్స్ పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :