తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం సూరారం, వీరభద్రపురం గ్రామాలలో నిర్వహించిన ఉపాధ్యాయులు భద్రాద్రి కొత్తగూడెం జూన్ 8 తెలుగు వెలుగు ) జూలూరుపాడు మండలం యుపి ఎస్ సూరారం మరియు ఎంపీపీ ఎస్ వీరభద్రపురంలో జరిగినటువంటి బడిబాట కార్యక్రమం లో ఉపాధ్యాయులు ఇంటింటా తిరుగుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, మధ్యాహ్న భోజనం, రాగి జావా, యూనిఫార్మ్స్ అందించటం జరుగుతుందని అలాగే ప్రాథమిక పాఠశాలలో ఏఐ విద్యను పెట్టడం జరుగుతుందని పిల్లల తల్లిదండ్రులకు క్లుప్తంగా వివరిస్తూ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్.పి.హెచ్.ఎస్ జూలూరుపాడు పాఠశాల ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ