తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : టేకులపల్లి మండలం మద్రాస్ తండాకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ ముతేష్ ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందారని స్థానికులు తెలిపారు. స్థానికుల వివరాలిలా.. ముతేష్ కూలీలను ట్రాక్టర్లో మిర్చి తోటకు తరలించి వస్తుండగా మార్గం మధ్యలో దాహం వేయగా, కిందకు దిగాడు. తిరిగి ట్రాక్టర్ స్టార్ట్ చేస్తుండగా, కిందపడి అకస్మాత్తుగా మృతి చెందాడని తెలిపారు. ఘటనపై టేకులపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ