Tuesday, 26 May 2026 11:25:38 PM
# సిపిఐ జిల్లా కార్యాలయంలో ఘనంగా గిరిప్రసాద్ 29వ వర్ధంతి. # జర్నలిస్టుల హక్కుల రక్షణకు, సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # రేషన్ డీలర్ల జిల్లా స్థాయి సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # ఎండ తీవ్రత ప్రాంతాల్లో రోడ్లపై నీళ్లు చల్లాలి. సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి ఎండ తీవ్రత కారణం. 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ డిమాండ్. # దళితుల అభ్యున్నతికి విశేష కృషి చేసిన మహనీయుడు భాగ్యరెడ్డి వర్మ : జిల్లా కలెక్టర్ అంకిత్. # జనగణన హౌస్ లిస్టింగ్‌లో ఖచ్చితత్వానికి ప్రాధాన్యం ఇవ్వాలి - డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ భారతి హోలీకేర్. # కాంట్రాక్ట్ కార్మికులకు పెండింగ్ సర్క్యులర్స్ ను విడుదల చేయాలి. ఏఐటీయూసీ కొత్తగూడెం రీజియన్ కార్యదర్శి యర్రగాని కృష్ణయ్య. # ఉద్యోగులు సమయపాలన పాటించాలి. ఐడీఓసీ కార్యాలయంలోని వివిధ శాఖలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్. # చండ్రుగొండ మండల కేంద్రం బస్ స్టేషన్ లో ని మరమ్మతు ల పనులను పరిశీలించిన అశ్వరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు జారే ఆదినారాయణ # 23వ డివిజన్లో ముఖ్య కార్యకర్తల సమావేశం. టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు పిలుపు. # ప్రజా ఆరోగ్యం పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # ఓటర్ల జాబితా సమగ్ర సవరణకు పార్టీ శ్రేణులు సహకరించాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # ఉపాధి హామీ నిధులతో చేపట్టిన పనులను వేగవంతం చేయాలి. ఉపాధి హామీ కూలీల సంఖ్యను పెంచాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # రైతులకు ఇబ్బందులు లేకుండా మొక్కజొన్న కొనుగోళ్లు చేపడుతున్నాం - జిల్లా కలెక్టర్ అంకిత్. # కాంగ్రెస్ పార్టీ 21 వ డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశం. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగా సీతారాములు పిలుపు. # జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు గల పోలీస్ ఫైరింగ్ రేంజ్ నందు జిల్లాలోని పోలీసు అధికారులు,సిబ్బందికి యాన్యువల్ ఫైరింగ్ ప్రాక్టీస్. # ప్రాణాపాయ స్థితిలో 8 ఏళ్ల బాలుడు. దాతల సహాయం కోసం తల్లిదండ్రుల వేడుకోలు. # చండ్రుగొండ మండలం, దామెరచర్లలో ఆగ్రహించిన అన్నదాత. # ఫిట్ అండ్ యాక్టివ్ తెలంగాణ 2K రన్‌లో ఉత్సాహంగా పాల్గొన్న ఎమ్మెల్యే జారె.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరి.జిల్లా కలెక్టర్ అంకిత్.

Date : 05 May 2026 07:47 PM Views : 230

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి.రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి – చర్ల పర్యటనలో జిల్లా కలెక్టర్ అంకిత్. చర్ల మండలంలో జిల్లా కలెక్టర్ అంకిత్ మంగళవారం విస్తృత పర్యటన నిర్వహించారు. ఈ పర్యటనలో భాగంగా ధాన్యం కొనుగోలు కేంద్రం, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలించి వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు.సత్యనారాయణపురం గ్రామంలోని పెద్దపల్లి–ముమ్మిడివరం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్, ఇప్పటివరకు వచ్చిన ధాన్యం పరిమాణం, కొనుగోలు ప్రక్రియ పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేంద్రంలో రైతులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలిస్తూ టార్పాలిన్లు, హమాలీలు, తాగునీరు వంటి మౌలిక వసతులు అందుబాటులో ఉన్నాయా అనే అంశాన్ని తనిఖీ చేశారు. కేంద్రానికి వచ్చిన రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వేగంగా చర్యలు తీసుకోవాలని, సమస్యలు ఉంటే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం లోడింగ్ ప్రక్రియ వేగవంతం చేయడానికి తగినన్ని లారీలను ఏర్పాటు చేయాలని సూచించారు. అకాల వర్షాల కారణంగా ధాన్యం నష్టపోకుండా రక్షణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ట్యాబ్ ఎంట్రీలను ఆలస్యం లేకుండా నమోదు చేయాలని ఆదేశించారు.అనంతరం సత్యనారాయణపురం గ్రామంలో జరుగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించారు. కాకర్లపూడి విజయలక్ష్మి పూర్తి చేసిన ఇల్లు, చినిగిరి రాజు రూఫ్ స్థాయిలో ఉన్న ఇల్లు, కారం నాగరాజు స్లాబ్ దశలో ఉన్న ఇల్లు పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనుల నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, పునాది నుంచి స్లాబ్ వరకు ప్రతి దశలో ఇంజనీరింగ్ ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని అధికారులకు ఆదేశించారు.నిర్మాణ పనుల పురోగతి, నాణ్యతపై సమీక్ష నిర్వహిస్తూ లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. సిమెంట్, ఇసుక, ఇనుము వంటి నిర్మాణ సామగ్రి నాణ్యంగా ఉండేలా చూడాలని, పనుల్లో ఎటువంటి నిర్లక్ష్యం జరగకుండా నిరంతర పర్యవేక్షణ చేయాలని సూచించారు. గ్రామంలో మంజూరైన 27 ఇళ్లలో 25 ఇళ్లు వివిధ దశల్లో కొనసాగుతుండగా, మిగిలిన ఇళ్లకు గ్రౌండింగ్ వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. ప్రభుత్వం పేదలకు నాణ్యమైన గృహ వసతి కల్పించడమే లక్ష్యమని, పనులు నిర్ణీత గడువులో పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.చర్ల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్, ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు మరియు మౌలిక సదుపాయాలను సమగ్రంగా పరిశీలించారు. మేటర్నిటీ వార్డు, డయాలసిస్ కేంద్రం, మందుల నిల్వ గది, వంటగది, అవుట్ పేషెంట్ విభాగం తదితర విభాగాలను సందర్శించి సేవల నాణ్యతను తనిఖీ చేశారు.ఓపీ విభాగంలో చికిత్స కోసం వచ్చిన రోగులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకుని సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మందుల నిల్వలను పరిశీలించి అవసరమైన ఔషధాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా స్టాక్ నిర్వహణను క్రమబద్ధీకరించాలని సూచించారు. రోగులకు అందించే ఆహారం నాణ్యతపై దృష్టి సారిస్తూ శుభ్రతతో కూడిన పోషకాహారం అందించాలన్నారు.ఆసుపత్రి ఆవరణలో 108 అంబులెన్స్ సిబ్బందితో మాట్లాడి అత్యవసర సేవల నిర్వహణపై వివరాలు తెలుసుకుని, సమయానికి స్పందిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో మరింత శ్రద్ధ వహించాలని సూచించారు. ఆసుపత్రిలో త్రాగునీటి కొరత ఉన్నట్లు గుర్తించి సంబంధిత అధికారులతో సమన్వయం చేసి నిరంతర నీటి సరఫరా కల్పించాలని ఆదేశించారు. ప్రతి రోగికి నాణ్యమైన వైద్య సేవలు, శుభ్రత, మౌలిక సదుపాయాలు అందేలా నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట తాసిల్దార్ శ్రీనివాసరావు, ఎంపీడీవో ఈదయ్య, గృహ నిర్మాణ శాఖ ఏ ఈ ముకేశ్ ,ఏ ఓ లావణ్య, మిషన్ భగీరథ ఏఈ లు అరుణ్,రాము, సామాజిక ఆరోగ్య కేంద్రం సూపర్డెంట్ డాక్టర్ సాయి వర్ధన్, డాక్టర్లు రాంప్రసాద్, రవికుమార్, తిరుపతిరావు, జాన్ మరియు ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :