Monday, 20 April 2026 01:36:03 PM
# అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ MLA,BRS పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు నేడు అశ్వారావుపేట మండలంలో విస్తృతంగా పర్యటించారు. # వైద్య ఖర్చులకు లక్ష రూపాయల ఎల్ఓసి మంజూరు చేసిన ఎమ్మెల్యే జారె. # మహా కుంభాభిషేకానికి రావాల్సిందిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆహ్వానించిన ఎమ్మెల్యే జారె. # గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ.

భద్రాద్రి జిల్లాలో రేడియాలజిస్ట్ సేవల్లో నూతన రికార్డ్

Date : 30 March 2026 05:11 PM Views : 163

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అన్ని ఏజెన్సీ ఆసుపత్రుల్లో రేడియాలజిస్టులు – TIFFA స్కాన్ సేవలు అందుబాటులో గిరిజన గర్భిణి మహిళలకు వరంగా మారనున్న స్కానింగ్ సేవలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రభుత్వ వైద్యరంగం మరో కీలక మైలురాయిని అధిగమించింది. జిల్లా వ్యాప్తంగా అన్ని ఏజెన్సీ ఆసుపత్రుల్లో రేడియాలజిస్టులను నియమించి, TIFFA స్కాన్ (Targeted Imaging for Fetal Anomalies) వంటి అత్యాధునిక స్కానింగ్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చి భద్రాద్రి వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులు నూతన రికార్డును నెలకొల్పాయి. దూర ప్రాంతాలు, గిరిజన ప్రాంతాల్లో నాణ్యమైన మాతృశిశు వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో జిల్లా అధికారులు దశలవారీగా తీసుకున్న చర్యలు ఫలితాన్నిస్తున్నాయి. గతంలోనే అన్ని ప్రధాన ఆసుపత్రుల్లో ప్రసూతి వైద్యులను నియమించడం ద్వారా ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రసూతి సేవలు గణనీయంగా మెరుగుపడ్డాయి. ఫలితంగా ప్రతి నెల డెలివరీలు, సిజేరియన్ శస్త్రచికిత్సలు, ట్యూబెక్టమీలు మరియు ఇతర మాతృసేవలు పెరిగాయి. ఈ క్రమంలో రేడియాలజీ సేవలను మరింత బలోపేతం చేస్తూ, భద్రాచలం, ఎల్లందు, పాల్వంచ, మణుగూరు ఆసుపత్రుల్లో ఇప్పటికే TIFFA స్కాన్ సేవలు అందుబాటులో ఉండగా, అశ్వారావుపేట మరియు చర్ల ప్రాంతాల్లో రేడియాలజిస్ట్‌ల కొరత ఒక ప్రధాన సవాలుగా నిలిచింది. గత కలెక్టర్ జితేష్ పాటిల్ మరియు డీసీహెచ్‌ఎస్ డా. రవి బాబు ప్రయత్నాలతో TIFFA స్కానింగ్ యంత్రాలు సమకూర్చబడగా, ప్రస్తుత జిల్లా కలెక్టర్ అంకిత్ చొరవతో కొత్త రేడియాలజిస్ట్‌ను అశ్వారావుపేట, చర్ల ఆసుపత్రులకు నియమించి ఈ లోటును పూర్తిగా అధిగమించారు. సహజంగా గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో రేడియాలజిస్ట్‌లను నియమించడం అత్యంత క్లిష్టమైన పని అయినప్పటికీ, జిల్లా పరిపాలన పట్టుదల, సమన్వయంతో ఈ సవాల్‌ను విజయవంతంగా ఎదుర్కొని, జిల్లాలోని ఆరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పూర్తి స్థాయిలో రేడియాలజీ సేవలను అందుబాటులోకి తీసుకురావడం విశేషం. ఇప్పటి వరకు అన్ని మాతృసేవలు అందుబాటులో ఉన్నప్పటికీ TIFFA స్కాన్ లేకపోవడం ఒక లోటుగా ఉండగా, ఇప్పుడు ఈ సౌకర్యం అందుబాటులోకి రావడంతో గర్భిణీలు పూర్తి స్థాయి మాతృసేవలను తమ ప్రాంతాల్లోనే పొందగలుగుతున్నారు. గర్భంలోని శిశువు అవయవాల అభివృద్ధిని వివరంగా పరిశీలించి, పుట్టుకలో వచ్చే లోపాలను ముందుగానే గుర్తించేందుకు TIFFA స్కాన్ ఎంతో ఉపయోగపడుతుంది. ఇది గర్భిణీకి సకాలంలో సరైన వైద్య నిర్ణయాలు తీసుకునేందుకు సహాయపడుతూ తల్లి-శిశువు భద్రతను మెరుగుపరుస్తుంది.అలాగే గర్భిణి స్త్రీలు దూర ప్రాంతాలకు వెళ్లకుండా ప్రయాణ సమయాన్ని, ఖర్చులను తగ్గిస్తుంది. ప్రత్యేకంగా పేద మరియు గిరిజన గర్భిణీలకు ఈ సేవలు ఎంతో మేలు చేస్తాయని, ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలపై ప్రజల్లో మరింత విశ్వాసం పెరుగుతుందని డి సి చ్ ఎస్ డాక్టర్ రవి బాబు తెలిపారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :