తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భదాద్రి కొత్తగూడెం మే 23 (తెలుగు వెలుగు ) : తెలంగాణలో పంచాయతీ ఎన్నికల ఎప్పుడొస్తాయా అని ప్రతిపక్షంతో పాటు ప్రజలు ఎదురుచూస్తున్నారు. అయితే జూన్ చివరి వారం లేదా జులై మొదటి వారంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. రేవంత్ సర్కార్ పంచాయతీల పెండింగ్ బిల్లులు క్లియర్ చేయడం, ప్రభుత్వ పథకాల అమలులో వేగం పెరగడం చూస్తుంటే ఎన్నికల కోసమే ఇదంతా అనే ప్రచారం సాగుతోంది. మరి ప్రభుత్వ నిర్ణయం ఏంటో వేచి చూడాలి.
Admin
తెలుగు వెలుగు టీవీ